జాతీయ వార్తలు

ఓటరునాడి పట్టేదెవరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: నిమిషానికో కథనం, రోజుకో సర్వే..ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి ఊహాగానాలు వారివి. ఎవరికివారికి గెలుపుధీమా..ప్రత్యర్థుల్ని చిత్తుచేయగలమన్న నమ్మకం. అంతిమంగా ఓటరు మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. అదీ ఓటు వేసిన తర్వాత కొన్ని గంటల అనంతరం ఫలితం వెలువడే వరకూ..!అంతవరకూ అందరిదీ ఆశల పందిరిలో కలల విహారమే..లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జయాపజయాలకు సోమవారం చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ శ్రీకారం చుట్టబోతోంది. కాంగ్రెస్-బీజేపీల మధ్య నువ్వానేనా అన్న రీతిలోనే ప్రచార యుద్ధం జరిగింది. రాఫెల్, పెద్ద నోట్ల రద్దు, ఆర్‌బీఐ అధికారాలను కత్తెర వేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోస్తే..దేశంలో వెనుకబాటుతనానికి కాంగ్రెస్సే కారణమని, అధికార యావ తప్ప దానికి మరో చింతలేదంటూ మోదీ విసుర్ల మాట ఎలా ఉన్నా..అంతిమంగా ‘పంచ్’పడేది ఎవరిన్నది చివరి వరకూ సస్పెనే్స. చివరి క్షణంలో ఆయారామ్ గయారామ్‌లు సృష్టిస్తున్న అలజడినీ తక్కువగా అంచనావేయడానికి వీల్లేదు. కాగా, ప్రాంతీయ పార్టీలను కలుపుకుని జాతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేపట్టింది. ఎన్డీయేను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి విధానాలే తమ విజయానికి హామీ అన్నట్టుగా బీజేపీ నాయకత్వం ఉంది.చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణల్లో జరిగే ఈ ఎన్నికల్లో విజయానికి రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరాటమే సాగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత వరుస పరాజయాలను చవిచూస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి విజయం సిద్ధిస్తే అది 2019 లోక్‌సభ ఎన్నికల్ని మరింత ధీమాగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి తిరుగులేని నైతికస్థయిర్యం లభిస్తుంది. అలాగే బీజేపీ ఈ ఎన్నికల్లో మరింతగా రాణిస్తే..ఇనుమడించిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్ని ఆ పార్టీ నాయకత్వం ఎదుర్కోగలుగుతుంది. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో 165, రాజస్థాన్‌లో 163,చత్తీస్‌గఢ్‌లో 49సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్‌కు వరుసగా 58,21,39సీట్లు ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లభించాయి. గత ఎన్నికల్లో చత్తీస్‌గఢ్‌కు సంబంధించి కాంగ్రెస్, బీజేపీల మధ్య పదిసీట్ల తేడా ఉంది. ఓట్ల వాటాలో తేడా 0.75శాతం. తాజా ఎన్నికల్లో రెండు పార్టీలకూ ప్రతికూల వాతావరణమే నెలకొంది. అధికార బీజేపీని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇరకాటంలో పడేస్తే..కాంగ్రెస్‌కు అజిత్‌జోగి-బీఎస్‌పీ పొత్తు సవాలుగా పరిణమించింది. ఈ కూటమి వల్ల బీజేపీకే ఎక్కువ నష్టమని, ఈ కూటమికి ఎన్ని సీట్లు వచ్చినా ఆ మేరకు నష్టపోయేది కమలనాథులేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ అధికార బీజేపీని ప్రభుత్వ వ్యతిరేకత వెంటాడుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలతో కాంగ్రెస్ గెలుపుధీమాతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 44.88శాతం, కాంగ్రెస్‌కు 36.38శాతం ఓట్లు లభించాయి. మాయావతి సారధ్యంలోని బీఎస్‌పీకి 6.29శాతం ఓట్లు లభించడాన్ని పరిగణనలోకి తీసుకంటే..కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏ పార్టీకి రెండుసార్లకు మించి అధికారం అప్పగించిన దాఖలాలు రాష్ట్ర చరిత్రలో లేవు కాబట్టి మిగతా రాష్ట్రాల కంటే కూడా మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటే అంతిమ ఫలితాన్ని నిర్దేశించబోతోంది. ఓ పక్క లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కచ్చితంగా విశే్లషించడం కష్టమేనన్నది నిపుణుల వాదన. ప్రచారంలో ఎవరిది పైచేయి అన్నదే కీలకం కాబోతోంది. అందుకే రెండు జాతీయ పార్టీల ప్రచార రథ సారథులు మోదీ,రాహుల్‌లు నువ్వానేనా అన్న రీతిలో ప్రచార దుందుభి మోగిస్తున్నారు.
ఓటరు (ఫైల్‌పొటో)