జాతీయ వార్తలు

అల్లర్ల సృష్టి పాకిస్తాన్ పనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: కాశ్మీర్‌లో ఇటీవలి అల్లర్లను రాజేయడంలో పాకిస్తాన్ కీలకపాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తానే భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోందని ఆయన తెలిపారు. కాశ్మీర్‌లో నెలకొన్న అశాంతిపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చకు హోంమంత్రి బదులిస్తూ కాశ్మీర్‌లో ఉద్రిక్తతలను సృష్టించడంలో పాకిస్తాన్ కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌పై పాకిస్తాన్ ‘బ్లాక్ డే’ పాటించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్‌కు లేదన్నారు. పాకిస్తాన్‌లో తెగల ప్రాతిపదికన ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని, ఈ విషయంలో పాకిస్తాన్ తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడానికి ‘బ్లాక్ డే’ పాటించిందని విమర్శించారు. ‘్భరత్‌లో ఉగ్రవాదం ఉందంటే, అది పాకిస్తాన్ పెంచి పోషించిందే’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రజలను చెదరగొట్టడానికి ప్రస్తుతం ప్రయోగిస్తున్న పెల్లెట్ గన్‌ల స్థానంలో ప్రత్యామ్నాయ ఆయుధాలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. పెల్లెట్ గన్‌ల స్థానంలో వినియోగించవలసిన ప్రత్యామ్నాయ ప్రమాదకరం కాని ఆయుధాలను ఈ కమిటీ సిఫారసు చేస్తుందని, రెండు నెలలలోగా ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని ఆయన వివరించారు. పెల్లెట్ గన్‌లను ప్రాణాంతకం కాని వాటిగా పేర్కొంటున్నప్పటికీ వాటి వల్ల ప్రజలు ప్రమాదకర స్థాయిలో గాయపడటం, కంటిచూపుపై ప్రతికూల ప్రభావం పడటం, కొంతమంది అయితే మొత్తం అంధులుగా మారిపోవడం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెరిగిందన్న కొంత మంది సభ్యుల భయాందోళనలను రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. భద్రతా దళాలు ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుపెట్టడం వల్ల లోయలో ఉగ్రవాదం తగ్గిందని వివరించారు.