జాతీయ వార్తలు

బిఎస్పీ భారీ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 21 బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి చెందిన వేలాది కార్యకర్తలు గురువారం లక్నోలో భారీ నిరసన ప్రదర్శన జరిపారు. నగరంలో రద్దీగా ఉండే దరియాగంజ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నాకు రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిగా బిఎస్పీ కార్యకర్తలు తరలివచ్చారు. దయాశంకర్ సింగ్‌ను అరెస్టు చేయడానికి పోలీసులకు 36 గంటల సమయం ఇస్తున్నట్లు ప్రదర్శనకు నాయకత్వం వహించిన యుపి శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు నసీముద్దీన్ సిద్దీఖి చెప్పారు. సింగ్‌ను త్వరగా అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్‌కు అల్టిమేటం ఇస్తూ మధ్యాహ్నం సమయంలో సిద్దీఖి తన నిరసనను విరమించారు. కాగా, సింగ్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు లక్నో, బలియాలలో దాడులు నిర్వహించారని, బలియాలో సింగ్ ఇంట్లో ఆయన సోదరుడు ధర్మేంద్రను అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ మనోజ్ ఝా చెప్పారు.
సింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాలని బిఎస్పీ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో గురువారం తెల్లవారుజామునుంచే హజరత్‌గంజ్ ప్రాంతానికి చేరుకోవడం ప్రారంభించారు. నిరసన ప్రదర్శన కారణంగా నగరంలో అనేక గంటలపాటు ట్రాఫిక్ ఆగిపోయింది.
చర్య తీసుకున్నాం.. ఇంకేం చేయాలి?
బిఎస్పీ నిరసన ప్రదర్శన నిర్వహించడంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ, ఆ అంశం ముగిసిపోయిందని, సింగ్‌పై పార్టీ చర్య తీసుకుందని, ఇంతకన్నా ఏం చేయాలని అన్నారు. అసలు విషయం ఏమిటంటే బిజెపి ముందుకు దూసుకెళ్తోందని, దాన్ని వాళ్లు జీర్ణించుకోలేకుండా ఉన్నారని వెంకయ్య చెప్పారు. కాగా బుధవారం రాత్రి బిఎస్పీ జాతీయ కార్యదర్శి మేవాలాల్ గులామ్ హజరత్‌గంజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దయాశంకర్ సింగ్‌పై ఐపిసి 153-ఎ, 504, 509 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

చిత్రం..లక్నోలో నిరసన తెలుపుతున్న బిఎస్పీ కార్యకర్తలు