జాతీయ వార్తలు

దళితుల హక్కులకు దిక్కులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమధియాల (గుజరాత్), జూలై 21: గుజరాత్‌లో బలహీన వర్గాలకు, దళితులకు దిక్కు లేకుండా పోతోందంటూ బిజెపి, ఆరెస్సెస్‌లపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవు చర్మాన్ని వలుస్తున్నారనే ఆరోపణపై గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనా పట్టణ శివార్లలో ఉన్న సోమధియాల గ్రామానికి చెందిన ఏడుగురు దళిత యువకులు గోరక్షా సమితికి చెందిన కార్యకర్తలు బట్టలూడదీసి దారుణంగా చితకబాదిన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా అలజడులను సృష్టిస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన సమధియాల, రాజ్‌కోట్ ప్రాంతాల్లో పర్యటించారు. దేశానికే నమూనా అంటూ ఏ రాష్ట్రాన్నయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్నారో అక్కడే దళితులకు తీవ్ర అన్యాయం జరగడం దారుణమని రాహుల్ వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలను భయభ్రాంతులను చేయడమే కాకుండా, వారిని అణచివేసే ప్రయత్నాలు కూడా గుజరాత్‌లో జరుగుతున్నాయన్నారు. ఒకపక్క నరేంద్ర మోదీ గుజరాత్ అభివృద్ధి గురించి, దాని ఆదర్శనియత గురించి ఘనంగా చెప్పుకుంటున్నారని, కాని ఎవరైతే వారి సిద్ధాంతాలకు విరుద్ధంగా గళాన్ని విప్పుతారో, తమకూ విద్య కావాలని కోరతారో, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడతారో వారిని అణచివేస్తున్నారని రాహుల్ అన్నారు. ఈ పోరాటం రెండు సిద్ధాంతల మధ్య జరుగుతోందని, ఒకటి- మహాత్మాగాంధీ, సర్దార్‌పటేల్ నెహ్రూ, అంబేద్కర్‌ల సిద్ధాంతమైతే, మరొకటి- ఆరెస్సెస్, నరేంద్ర మోదీ సిద్ధాంతమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ సిద్ధాంతాన్ని తిప్పికొడతామని, ఒక్క గుజరాత్‌లోనే కాకుండా ఎక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తినా వాటిని తిప్పికొడతామని బాధిత వర్గాలకు రాహుల్ ధీమా అందించారు.
బాధితులకు రాహుల్ పరామర్శ
గురువారం ఉదయం సమధియాల చేరుకున్న రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలను సందర్శించివారికి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు నలభై నిమిషాలు గడిపిన రాహుల్ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చూసి తాను సిగ్గుపడుతున్నట్లు అన్నారని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. కుమారి సెల్జా, గురుదాస్ కామత్‌లతో కలిసివచ్చిన రాహుల్ గ్రామంలోని బాధిత కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు. ఢిల్లీనుంచి విమానంలో దగ్గర్లోని కేంద్రపాలిత ప్రాంతమైన డయూలో దిగిన తర్వాత గ్రామానికి చేరుకున్న రాహుల్ బాలుభాయి సరవియ, ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్నవాళ్లను అత్యంత కఠినంగా శిక్షించాలని, జీవితమంతా జైల్లోనే ఉంచాలని తాము రాహుల్‌ను కోరామని, అలా చేయకపోతే మరొకరి విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తారని అతను చెప్పాడు. గోరక్షా సమితి సభ్యులు తమ బంధువులను కొడుతున్నప్పుడు పోలీసులు తమకు సాయంగా రాలేదని రాహుల్‌కు చెప్పామని ఇంజినీరింగ్ చదువుతున్న జితూ చెప్పాడు.

చిత్రం..రాజ్‌కోట్‌లోని ఆసుపత్రిలో బాధితుల గాయాలను పరిశీలిస్తున్న రాహుల్ గాంధీ