జాతీయ వార్తలు

రిజర్వుడు సీట్లలో హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో రిజర్వుడు సీట్లు 82 ఉన్నాయి. వీటిల్లో 47 అసెంబ్లీ సీట్లను గిరిజనులకు, 35 సీట్లు ఎస్సీవర్గాలకు రిజర్వు చేశారు. ఈ సీట్లలో పాగావేసేందుకు, ఆకర్షణీయమైన వరాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఎత్తుగడలతో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 82 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ సీట్లు ఎవరికి వస్తేవారు విజయానికి చేరువవుతారు. షాడోల్, దిండోరి, మాండ్లా, అలిరాజ్‌పూర్, జాబువాలో గిరిజనుల ఆధిపత్యం ఎక్కువ. గిరిజన ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపితే, ఆ పార్టీ గెలుస్తుంది బిండా, తికాంగర్, రేవా, రైజన్ తదితర ఫ్రాంతాల్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 15.6 శాతం మంది ఎస్సీలు, 21.1 శాతం మంది గిరిజన పుత్రులు ఉన్నారు. రాష్ట్ర జనాభా 7.26 కోట్లు,
గతంలోకి వెళితే, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 82 స్థానాలకు, బీజేపీ 59 సీట్లను గెలిచింది. 31 ఎస్టీ సీట్లలో 28 ఎస్సీ సీట్లలో బీజేపీ గెలిచి రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ 15 సీట్లతో సరిపెట్టుకుంది. 2008 ఎన్నికల్లో బీజేపీ 54 సీట్లను, కాంగ్రెస్ 26 సీట్లలో నెగ్గాయి. 2003 నుంచి రిజర్వుడు సీట్లలో బీజేపీ హవా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రభంజనంలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు బీజేపీ పక్షాన నిలబడ్డారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. ఆ తర్వాత కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోయాయి. దీంతో ఈ నియోజకవర్గాలు బీజేపీ వశమయ్యాయి. 2003లో బీజేపీ ఎకాఎకిన 67 సీట్లను, కాంగ్రెస్ ఐదుసీట్లను గెలుచుకున్నాయి. 82 సీట్లలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందనే ఆకాంక్ష, పట్టుదలతో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలు పడి ప్రచారంచేస్తున్నాయి. ప్రస్తుతం వ్యతిరేక ప్రభంజనం ఎదుర్కొంటున్న అధికార బీజేపీ ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున గత 14 ఏళ్లుగా సంక్షేమ పథకాలను చేపట్టింది. దీని వల్ల ఈ జిల్లాల ముఖ స్వరూపం మారిపోయింది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లను గెలిచేందుకు బీజేపీ రాజకీయ వ్యూహంతో ముందుకెళుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ జిల్లాల్లో ఆరెస్సెస్ క్యాడర్ బాగాపనిచేస్తోంది. బీజేపీ గెలుపుకోసం వారు అహర్నిశలు పనిచేస్తున్నారు. వనవాసి కల్యాణ్ పరిషత్ ఆరెస్సెస్ గిరిజనులు, ఎస్సీ వర్గాల్లో విస్తరించింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, రాష్ట్రప్రభుత్వం స్పాన్సర్ చేసే స్కీంలు లడ్డీ లక్ష్మీ యోజన, సంబల్ యోజన లాంటి స్కీంలను ప్రభుత్వం అమలు చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే అడవులపై లీజు హక్కులను గిరిజనులకు ఇస్తామని పౌష్టికాహార అలవెన్సును రూ.1000 నుంచి రూ.1500కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాగా పరిశీలకులు మాత్రం ఈ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. బీఎస్పీకి 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో 4 సీట్లు వచ్యా. ఈ సారి 10కి పైగా సీట్లు తమకు వస్తాయని బీఎస్పీ నేతలంటున్నారు. బలహీనవర్గాలు, దళితులు బీజేపీ పనితీరుతో విసుగుచెందారని, వారు ఆ పార్టీకి ఈ సారి ఓటు వేయరని, కాంగ్రెస్‌ను నమ్మరని, బీఎస్పీ చీఫ్ మాయావతి నాయకత్వం వైపు మొగ్గుచూపుతున్నారని బీఎస్పీ ప్రదీప్ అహీర్‌వార్ అన్నారు.
కాగా నవంబర్ నెలలో ఈ వారంలో గిరిజన ప్రజలు దశ గోత్ర పేరిట భారీ ఎత్తున మరణించిన పెద్దలకు తంతు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీంతో ఈ కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు నేతలు పోటీలు పడి హాజరవుతున్నారు.

చిత్రాలు.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. రాహుల్‌గాంధీ