జాతీయ వార్తలు

మానవత్వానికే మచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడి మానవత్వానికే మాయని మచ్చ అని కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్వరంతో స్పందించింది. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానంగా చెప్పింది. ఎన్టీయే పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. గోరక్షణ కార్యకర్తలు కొందరు దళితులను బహిరంగంగా కొట్టిన సంఘటనపై వెంటనే స్పందించిన గుజరాత్ ప్రభుత్వం 16మంది దోషుల్ని అరెస్టు చేసి ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఆరు నెలల్లో ఈ కేసును ముగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తోందని కూడా ఆయన తెలిపారు. దళితులపై దాడులకు పాల్పడితే తమ ప్రభుత్వం సహించదన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, కొన్నిచోట్ల ‘తాలిబన్ తరహా’ పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి.