జాతీయ వార్తలు

చేదుమాత్ర తప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాబువా/రేవా: దేశాన్ని అవినీతి ఊబి నుంచి రక్షించేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు పెద్ద నోట్లరద్దు అనే కఠినమైన వైద్య విధానాన్ని అమలు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో అవినీతి సొమ్ము చలామణిని అరికట్టి, బ్యాంకుల పరిధిలోకి ఈ సొమ్మును తెచ్చామని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఓటర్లు విధేయత, సమగ్రతకు ప్రాధాన్యత ఇచ్చి బీజేపీకి ఓటు వేయాలన్నాలరు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవినీతికి ఓటు వేసినట్లే అన్నారు. జాబువాలో బీజేపీ నిర్వహించిన బ్రహ్మాండమైన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ కుళ్లిపోవడానికి కారణం నల్లధనం. దీనికి విరుగుడుగా భావించే పెద్ద నోట్ల రద్దు అనేది చేదు మాత్ర అన్నారు. దేశంలో కొంత మంది నల్లధనాన్ని తమ పరుపుల కింద, ఇండ్లలో, ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో కొన్ని అడ్డాల్లో దాచుకున్నారన్నారు. వాటిని వెలికితీయాలంటే పెద్ద నోట్ల రద్దు కంటే మించిన ఔషధం మరొకటి ఏమి ఉందన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు పన్ను పరిధిలోకి వస్తున్నారని, పన్నులు చెల్లించే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైందన్నారు. గ్యారంటీ లేకుండా ఇంతవరకు దేశంలో 14 కోట్ల మంది ప్రజలకు రుణాలు ఇచ్చామన్నారు. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన కింద పరిశ్రమలు స్థాపించేందుకు రుణాలు చెల్లిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై పదేళ్లలోకూడా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని, తమ పార్టీ నాలుగేళ్లలో చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం అంటే గిట్టదన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయరాదన్నారు. దీని వల్ల పేదరికం, ఆర్థిక అసమానతలు పెరుగుతాయన్నారు. అందరికి ఇల్లు అనే బృహత్తర ప్రణాళికను చేపట్టామని, 2022 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మిస్తామన్నారు. ఇంతవరకు దేశంలో 1.25 కోట్ల మంది ఇంటి తాళం చెవులు ఇచ్చామన్నారు. యుపీఏ సర్కార్ మేడం సర్కార్ అన్నారు. రిమోట్ కంట్రోల్ సర్కార్‌గా చలామణి అయిందన్నారు. రేవాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నందు వల్ల అభివృద్ధి సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు అవకాశం ఉండదన్నారు. కీలక పదవులన్నీ ఒకే కుటుంబం వారే అనుభవిస్తున్నారన్నారు. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ప్రతీక అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు. 2003 నుంచి ఇంతవరకు జరిగిన అభివృద్ధిని విశే్లషించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 14 ఏళ్ల క్రితం వైద్య సేవలు అందుబాటులో ఉండేవికావని, కాన్పుల కోసం సుదూరంలో ఉన్న పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లే స్థితి ఉండేదన్నారు. ఈ రోజు ప్రజల వద్దకే వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ప్రజలు రోజుకు పది గంటలు పనిచేస్తే తాను రోజుకు 11 గంటలు పనిచేస్తానన్నారు. తాను రాజకీయాధికారంలో గత 15 ఏళ్లుగా ఉన్నానాన్నరు. యూపీఏ హయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు కాంగ్రెస్ ద్వంద్వ నీతి నుంచి రక్షించుకున్నారన్నారు.
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం
చిత్రం..ఓ గిరిజన జిల్లాలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ