జాతీయ వార్తలు

రైతులను అవమానిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: నోట్ల రద్దు నిర్ణయంతో రైతుల జీవితాలను నాశనం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు ఎన్నికల సభలలో వారి కష్టాలను అపహాస్యం చేస్తూ అవమాన పరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఒక పక్క నోట్ల రద్దు నిర్ణయంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంగీకరిస్తుండగా, మోదీ మాత్రం ఎన్నికల సభల్లో వారి కష్టాలపై జోక్‌లు వేస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయంలో రైతలు ఎరువులు, విత్తనాలు వంటివి కొనుగోలు చేయడానికి చేతిలో నగదు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు. అయితే ఇటీవల చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దుకు ముందు ప్రజలు, రైతులు తమ నల్లధనాన్ని తమ పరుపుల కింద, గోధుమ బస్తాల కింద దాచి పెట్టారని, కాని నోట్ల రద్దు తర్వాత ఆ నల్లధనం అంతా బయటకు వచ్చిందని అన్నారని ఇది ప్రజలు, రైతులను అవమానించడమేనని రాహుల్ విమర్శించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలకు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, మెహల్ ఛోక్సీ లాంటి బడాపారిశ్రామికవేత్తలు ఎన్నడూ గోధుమల మొహం ఎరిగి ఉండరని, వారు గోధుమ బస్తాలతో ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా మోదీ? అని రాహుల్ ప్రశ్నించారు. ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలతో రైతులను అవమానించవద్దని పేర్కొంటూ, మోదీ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను ఆయన ట్యాగ్ చేశారు. నోట్ల రద్దు పేరుతో పేద రైతుల నుంచి వసూలు చేసిన డబ్బును మోదీ తన సూటు-బూటు మిత్రులకు అందజేశారని ఆరోపించారు. రైతుల వద్ద ఉన్న డబ్బు నల్లధనం అని తన ప్రసంగాల్లో పేర్కొన్న ఆయన రైతులను తీవ్రంగా అవమానించారని, ఇది ఎంతమాత్రం సహించరానిదని రాహుల్‌గాంధీ హెచ్చరించారు.