జాతీయ వార్తలు

ఆగస్టులో మరో రెండు ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రెండు ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు చివరలో పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ద్వారా మూడు దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. ఇది పూర్తిగా వాణిజ్య రంగ ప్రయోగం. అదే మాసంలో లేక సెప్టెంబరు రెండోవారంలో జిఎస్‌ఎల్‌వి- ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రెండో ప్రయోగ వేదిక నుండి జరిగే జిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందని జీశాట్-8 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇప్పటికే ఈ రాకెట్‌కు సంబంధించిన పరికరాలు తిరువనంతపురంలోని ఇస్రో సెంటర్ నుంచి షార్‌కు చేరుకున్నాయి. ఈ రెండు ప్రయోగాల మధ్యలో ఎటిఆర్ అనే మరో ప్రయోగం కూడా ఇస్రో చేపట్టనుంది. వాస్తవానికి ఈ నెల 18న ఈ ప్రయోగం జరపాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.