జాతీయ వార్తలు

కేరళ అసెంబ్లీని కుదిపేసిన ‘శబరిమల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 3: శబరిమల వివాదం అంశం సోమవారం కేరళ అసెంబ్లీని కుదిపేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వరుసగా నాలుగోరోజూ సభలో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ముగ్గురు అసెంబ్లీ ఎదుట సత్యాగ్రహం మొదలెట్టారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు. సభ ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ రోజూలాగే వాయిదా వేశారు.సీపీఎం నాయకత్వంలోన ఎల్‌డీఎఫ్ ఎమ్మెల్యేలు తమ సీట్ల వద్దే నిలబడి నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల సీట్లవైపుచూస్తూ కేకలు వేశారు. పరిస్థి అదుపుతప్పుతుందని భావించిన స్పీకర్ ఇరుపక్షాలను తీవ్రంగా హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత చెన్నితల మాట్లాడుతూ సభ సజావుగా సాగడానికి తాము సహకరిస్తానని స్పీకర్‌కు స్పష్టం చేశారు. శబిరిమలలో నిషేధాజ్ఞలు ఎత్తివేస్తే యూడీఎఎఫ్ ఎమ్మెల్యేలు శివకుమార్(కాంగ్రెస్), పరక్కల్ అబ్దుల్లా(ఐయూఎంఎల్), ఎన్ జయరాజ్(కేసీ-ఎం)లు చేపట్టిన సత్యాగ్రహాన్ని విరమించుకుంటారని ఆయన వెల్లడించారు.దీనిపై సీఎం విజయన్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై వివాదాన్ని రేపుతున్నాయని ఆయన ఆరోపించారు. అమిత్‌షా, రాహుల్ గాంధీ ఆడమన్నట్టు యూడీఎఫ్ ఆడుతోందని ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు.కాగా తాము నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సీఎం అనుమతి అక్కర్లేదని చెన్నితల తిప్పికొట్టారు.