జాతీయ వార్తలు

ఆయనకు పేర్లు మార్చడమే పని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్‌పైన శివసేన ధ్వజమెత్తింది. యోగి కేవలం నగరాల పేర్లు మార్చడం పట్ల శ్రద్ధపెట్టారని, రాష్ట్రంలోని వౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని, దీని వల్ల బులందర్‌షహర్ ఘటనలు తలెత్తాయని పేర్కొంది. సైనికులు, పోలీసులకు మతం ఉండదన్నారు. వీరు బాధ్యతలు సజావుగా నిర్వహించేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్‌పైన విమర్శలు చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపడుతారని శివసేన ప్రశ్నించింది. బులందర్‌షహర్ ఘటన బాధాకరమని పేర్కొన్నారు. గోమాంస వివాదంలో ఇద్దరు పోలీసులను మూకలు దాడి చేసి చంపేశాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామని చేసిన ప్రకటనను శివసేన తప్పుబట్టింది. స్థానిక ప్రజల సెంటిమెంట్లు జోలికి వెళ్లడం భావ్యం కాదని తెలిపింది. హైదరాబాద్ పేరు కంటే ముందు తన రాష్ట్రంలో వౌలిక సమస్యల పరిష్కారంపై శ్రద్ధ కనపరచాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం మాదిరిగా ఒవైసీ బ్రదర్స్ ఇక్కడి నుంచి పరారవుతారని చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఔరంగాబాద్ పేరును శంబూజీనగర్‌గా, ఉస్మానాబాద్‌పేరును ధారాశివ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. మోదీ మంత్రివర్గమంతా ఎన్నికల ప్రచారంలో ఉంటూ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని సామ్నా పేర్కొంది.