జాతీయ వార్తలు

కుదుటపడుతున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 23: కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత మెరుగుపడటంతో శనివారం నాలుగు జిల్లాలతోపాటు శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూను ఎత్తివేశారు. కాశ్మీర్ లోయలోని మిగతా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. బండిపొర, బారాముల్లా, బుడ్‌గామ్, గందేర్‌బల్ జిల్లాలతోపాటు శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేసినట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. అయితే కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రాంతాల్లో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 144 కింద నలుగురు, అంతకన్నా ఎక్కువ మంది గుమికూడటానికి వీలులేదనే ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ఆ అధికారి వివరించారు. అనంత్‌నాగ్, కుల్గాం, కుప్వారా, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో, శ్రీనగర్‌లోని ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ హతమైన మరుసటి రోజు ఈ నెల 9నుంచి కాశ్మీర్‌లో ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు.

చిత్రం..అల్లర్లలో 45 మంది మృతికి నిరసనగా శనివారం శ్రీనగర్‌లో ఆందోళన చేస్తున్న దృశ్యం