జాతీయ వార్తలు

ఈవీఎంలతో జాగ్రత్త సుమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంల పట్ల జాగరూకత వ్యవహించాలి, ప్రధాని నరేంద్ర నాయకత్వంలోని భారత్‌లో ఎలక్ట్రానింగ్ ఓటింగ్ యంత్రాలు వింతగా వ్యవహరిస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాహుల్ ట్వీట్ చేశారు. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. పోలింగ్ ముగిసిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు ట్వీట్ చేయడం గమనార్హం. ‘మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు వింతగా వ్యవహరించాయి’అని ఆయన వ్యంగ్యోక్తులు విసిరారు. ‘మధ్యప్రదేశ్‌లో ఈవీఎం భద్రతను పర్యవేక్షించవలసిన వ్యక్తులు కొందరు ఒక వాహనంతో రెండు రోజుల పాటు మాయమయ్యారు. మరి కొందరు ఒక హోటల్‌లో మద్యపానం చేస్తూ కనిపించారు’ అని రాహుల్ గుర్తుచేశారు. నరేంద్ర మోదీ హయాంలో ఈవీఎంలలో రహస్య శక్తులు చొరబడతాయని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీట్‌లపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది. శాసన సభల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని తెలిసే ఆయన ఈరకమైన ట్వీట్లు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది.
గెలిస్తే వారి గొప్ప, ఓటమిపాలైతే ఈవీఎం తప్పు అన్నట్టు వ్యవహరించడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని దుయ్యబట్టారు.

చిత్రం..రాహుల్