జాతీయ వార్తలు

దుస్సాహసానికి పాల్పడితే బుద్ధిచెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కపుర్తలా (పంజాబ్), డిసెంబర్ 8: పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్జికల్‌ దాడుల ద్వారా స్పష్టమైన హెచ్చరికలను జారీ చేశామని, భవిష్యత్తులో ఎటువంటి దుస్సాహసానికి దిగిన తగినబుద్ధి చెబుతామని ఆర్మీనార్తరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పారు. కాగా ఈ దాడులను ప్రతి నిత్యం ఎక్కువ చేసి చెప్పడం తగదంటూ రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా వ్యాఖ్యలు చేసిన మర్నాడు రణబీర్‌సింగ్ ప్రకటన చేయడం గమనార్హం. 2019 సెప్టెంబర్ 29వ తేదీన భారతీయ వైమానిక దళాలు పీవోకేపై సర్జికల్ దాడులు చేశాయి. మిలిటరీ కోణంలో ఈ దాడులు వ్యూహాత్మకంగా ఫలించాయని సింగ్ చెప్పారు. పాక్ భవిష్యత్తులో గీతదాటితే చేతులు ముడుచుకుని కూర్చోమని చెప్పినట్లయిందన్నారు. ఆయన ఇక్కడ సైనిక స్కూలును సందర్శించిన తర్వాత విలేఖర్లతో మాట్లాడుతూ, పూర్తి స్థాయి నైపుణ్యంతో, సాహసంతో, నిర్దేశించిన లక్ష్యాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసిన సర్జికల్ దాడులు విజయవంతమయ్యాయన్నారు. ఈ దాడుల వల్ల చొరబాటుదారుల బెడదను తగ్గించామన్నారు. సరిహద్దులకు ఆవల ఏమి జరుగుతుందో నిరంతరం నిఘా ఉందన్నారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాక్ చేస్తున్న పన్నాగాలు సాగవన్నారు. టెర్రరిజాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జమ్ముకాశ్మీర్‌లో చొరబాటుకు, అల్లర్లకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు.