జాతీయ వార్తలు

దేశాభివృద్ధికి చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయ యువత భాగస్వామలు కావాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పిలుపునిచ్చారు. భారత్ విదేశాలకు రాయబారుల్లా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎనిమిది దేశాలకు చెందిన 40 మంది భారత సంతితి యువతతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఏ దేశంలో ఉంటున్నా మాతృభూమిని మరచిపోవద్దని ఆయన హితవుచెప్పారు. దేశాభివృద్ధిలో భాగస్వాములుకావడం ద్వారా సొంత దేశానికి సేవలందించాలని రిజిజు స్పష్టం చేశారు.‘ మీ ఆలోచనలు, అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం మాతృదేహానికి అందించండి. అభివృద్ధిలో భాగస్వాములు కండి. అలాగే మీ సలహాలు, సూచనలు ఇవ్వండి’అని మంత్రి విజ్ఞప్తి చేశారు. నవభారత్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని, ప్రవాస భారతీయుల సహకారం ఉంటే మరింత ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల, కళల గురించి తెలుసుకునేందుకు ఇక్కడకు రావాలని హోమ్‌శాఖ సహాయ మంత్రి పిలుపునిచ్చారు. కాగా నౌ ఇండియా ప్రోగ్రామ్(కైఐపీ) కింద ప్రవాస భారత యువతకు కేంద్రం ఓ టూర్ నిర్వహించింది. 18-30 ఏళ్ల మధ్య వయస్కులైన ఎన్నారై యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.