జాతీయ వార్తలు

కలసి‘కట్టు’గా పనిచేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కుట్రలు, ముఠా తగాదాలకు కాంగ్రెస్‌లో కాలం చెల్లిందని, ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఏకతాటిపై నిలబడి బీజేపీని ఓడించేందుకు శాయశక్తులా కృషిచేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 28న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో సింధియా ఏకంగా 115 నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను భుజానవేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కృతనిశ్చయంతో పనిచేసినట్లు సింధియా వెల్లడించారు. ఈ కృషి ఫలితంగానే ఈ నెల 11న జరగనున్న ఓట్ల లెక్కింపులో ఫలితం తమ పార్టీకే అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ ఏర్పడే పరిస్థితులున్నాయన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకే స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా అన్న ప్రశ్నకు మొదట గెలవడం ముఖ్యమని, ఆ తర్వాత అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని సింధియా ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. సింధియాతోపాటు మరో సీనియర్ నేత కమల్‌నాథ్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కుట్రలు, ముఠా తగాదాలు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేవని, కేవలం అధికార పక్షాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేశామని, అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తామని సింధియా వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా గెలిచి తీరాలని 15ఏళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.