జాతీయ వార్తలు

సెమీ ఫైనల్స్ .. విజేతలెవరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో అన్ని పార్టీల్లోనూ జయాపజయాల గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఇటు అభ్యర్థులు, అటు పార్టీల అధినేతలూ కూడా గందరగోళంలో పడిపోయారు.
ఈ స్పష్టత లేని పరిస్థితుల్లో అందరిదీ ‘మేమే గెలుస్తా’మన్న ధీమా..మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశానే్న ఇవ్వబోతున్నాయని కాంగ్రెస్ అంటోంది. ఈ సర్వేలన్నీ కూడా రాజస్థాన్‌లో పూర్తి మెజార్టీ సహా కనీసం నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే పేచేయి అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. బీజేపీ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోకుండా అసలు ప్రజలేమిచెబుతారో చూడాల్సిందేనని, పైగా, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రభావం సోమవారం స్టాక్‌మార్కెట్‌పై కూడా పడింది. సెనె్సక్స్ ఏకంగా ఏడొందల పాయింట్లు కోల్పోయింది. కాగా, ఎంపీ కుష్వాహ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌సమత పార్టీ ఎన్‌డిఏకు గుడ్‌బై చెప్పడం విపక్షాల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పక్షాలు సమావేశమైన రోజునే కుష్వాహా ఎన్‌డిఏ నుంచి తప్పుకోవడం గమనార్హం. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 678 సీట్లకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయ్యే కౌంటింగ్‌కు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల (రాజస్థాన్, చత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్) అధికారంలో ఉన్న బీజేపీకి వీటి ఫలితాలు అత్యంత కీలకంగానే పరిణమించబోతున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల ఫలితాలే బీజేపీ 62 సీట్లను తెచ్చి పెట్టాయి.
బీజేపీని హోరాహోరీగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం చాలా కీలకం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు ఈ ఫలితాలు తమకు మరింత ఊతాన్నిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.