జాతీయ వార్తలు

పీఠంపై మళ్లీ గెహ్లట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్/న్యూఢిల్లీ: రాజస్థాన్ ప్రజలు తమదైన రీతిలో తీర్పునిచ్చారు. విడతల వారీగా కాంగ్రెస్, బీజేపీలకు పట్టం కడుతూ వచ్చిన ఓటర్లు ఈ సారి వసుంధర ప్రభుత్వాన్ని సాగనంపి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. సంప్రదాయానికి స్వస్తి పలికి రెండోసారీ తమదే అధికారమంటూ బీజేపీ సాగించిన పోరాటం ఫలించలేదు. రాహుల్ సారధ్యంలోని కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ప్రజలు పలువురు బీజేపీ మంత్రులనూ ఇంటికి పంపారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లట్‌ల నాయకత్వ పటిమ, రాహుల్ మార్గ నిర్దేశన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు దోహదం చేసింది. అనుకున్న స్థాయిలో బీజేపీపై విజయం సాధించలేక పోయామన్న భావన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్నప్పటికీ వచ్చిన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి పదవికి దక్కేది గెహ్లట్‌కా పైలట్‌కా అన్న సందేహాల నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గెహ్లట్‌కే ఈ పదవి దక్కుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. శాసన సభా పక్ష సమావేశానికి హాజరయ్యే కేంద్ర పరిశీలకులు ఇచ్చే సమాచారాన్ని బట్టే ముఖ్యమంత్రి ఎవరన్న ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రాజే సహా ఐదుగురు మంత్రులు గెలుపొందగా, 13మంది మంత్రులు కాంగ్రెస్ ప్రభంజనానికి పతనమయ్యారు.
జవజీవాలు నింపిన పైలట్
గత ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపడతుందా అని అభిమానుల్లో సందేహం.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాజస్థాన్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన యువ పైలట్ తాను విమానాలు నడపడంలోనే కాదు.. ప్రజల మనసులు గెలవడంలోనూ నేర్పరినని రుజువు చేసుకున్నాడు యువ సచిన్‌పైలట్. రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గత పరాజయాలను అధిగమించి కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యుడయ్యాడు. 2013 ఎన్నికల్లో 200 సీట్లకు కేవలం 21 సీట్లు మాత్రమే గెల్చుకుని ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న పార్టీకి ఈసారి 199 సీట్లకు 100 సీట్లను సంపాదించి పార్టీకి అధికారాన్ని ఖరారు చేశాడు. ఇక్కడ అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ విజయం వెనుక సచిన్‌పైలట్ అవిశ్రాంత కృషి ఎంతోఉంది. సీనియర్ లీడర్లను మాత్రమే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని అధిష్టానం నిర్ణయిస్తే అశోక్‌గెహ్లాట్ లాంటి వారికి ఆ పదవి దక్కవచ్చునేమో కాని, ఈ ఎన్నికల్లో పార్టీ విజయంలో సచిన్‌పైలట్ పాత్ర మరువలేనిది. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలను ఆయన ఆకట్టుకున్న తీరు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను దీటుగా ఎదుర్కొన్న విధానం ఎంతమాత్రం తక్కువ చేయలేం. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన రాజేష్ పైలట్ కుమారుడే సచిన్ పైలట్. ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కాలేజీలో, తర్వాత వార్టన్‌లో ఎంబీఏ చదివిన ఈయన అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. 2000లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తండ్రి రాజేష్‌పైలట్ మృతితో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సచిన్‌పైలట్ తర్వాత తన కొత్త ప్రయాణాన్ని కొనసాగించాడు. 2004లో దాసా నియోజకవర్గం నుంచి అతి చిన్నవయసులోనే ఎంపీగా ఎన్నికై రికార్డుకెక్కాడు. 2009లో తిరిగి ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 2012లో సైతం యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత రాజస్థాన్ రాజకీయాలపై దృష్టి సారించాలన్న రాహుల్ సూచన మేరకు పూర్తిగా అందులో నిమగ్నమయ్యాడు. రాష్ట్రంలో ఐదు లక్షల కిలోమీటర్లు పర్యటించి ప్రజల కష్టనష్టాలను అధ్యయనం చేశాడు. పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్టం చేసే అంశంపై దృష్టిపెట్టాడు. రాష్ట్ర పార్టీ చీఫ్‌గా యువతతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
*
రాజస్థాన్
*
మొత్తం సీట్లు - 199
కాంగ్రెస్ - 100
బీజేపీ - 73
బీఎస్పీ - 6
ఇతరులు - 20
*
చిత్రం..గెహ్లట్