జాతీయ వార్తలు

ఏపీలోనూ కలిసే పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైనా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కలి సి పోటీ చేసేందుకు తెరవెనక ప్రయత్నాలు ప్రా రంభమయ్యాయి. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ప్రజాకూటమిని ఏర్పా టు చేస్తున్న నేపథ్యంలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకతప్పదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పో టీ జరుగనున్నది. టీడీపీ, కాంగ్రెస్ ఒక కూట మి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన, బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతా యి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి 29.1 శాతం ఓట్లు లభిస్తే వైఎస్‌ఆర్‌సీపీకి 28.9 శాతం, కాంగ్రెస్‌కు 2.1 శాతం లభించాయి. 2019 ఏప్రిల్-మేలో లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇప్పుడు నాలుగైదు శాతం ఓట్లున్నాయి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మద్దతుదారుల సంఖ్య విపరీతంగా పెరిగినందున అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు శాతం బాగా పెరుగుతందని అంచనా వేస్తున్నారు. చం ద్రబాబు పాలనపై వస్తున్న విమర్శల మూలం గా టీడీపీ ఓట్ల శాతం బాగా తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 14 శాతం ఓట్లు లభించవచ్చని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నం తదితర జిల్లాల్లో వవన్ కళ్యాణ్‌కు మంచి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు శాతం రెండు శాతం నుండి నాలు గు శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ ఎవరితో పొత్తుపెట్టుకోకుండా స్వతంత్రంగా పోటీచేస్తే ఓడిపోవటం ఖాయమ ని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం గతంలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలవాలంటే ఆయన ఈసారి కూడా ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే తెలుగుదేశం పొత్తు పెట్టుకునేందుకు వీలున్నది. పవన్ కళ్యాణ్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటారనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీని సమర్థంగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకతప్పదని అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వలన కాంగ్రెస్‌కు రాజకీయంగా లాభం కలుగుతుందని ఏపీకి చెందిన సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవటం వలన తెలుగుదేశం ఓట్లు నాలుగైదు శాతం పెరిగి సీట్ల విషయంలో ఎంతో ప్రయోజనం కలుగుతుందని వారంటున్నారు.