జాతీయ వార్తలు

గో సంరక్షణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో మార్పు తీసుకురావడానికి గోసంరక్షణ చాలా అవసరమని కేంద్రమంత్రి రామదాస్ అతవాలె పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ముస్లిం గావ్ రక్ష సంఘ్‌ను బుధవారం ప్రారంభించిన ఆయన నిజంగా ఇది విప్లవాత్మకమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ముస్లింలు గోరక్షణ సంస్థను ఏర్పాటు చేయడం అనూహ్యమని, గోవధ వద్దంటూ వారు ప్రచారం చేయడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఈ చర్య హిందూ, ముస్లింలను మరింత దగ్గర చేస్తుందని, భారత్‌లో మార్పు తేవాలని అనుకుంటే గోసంరక్షణ విధానాన్ని అమలుపర్చాలని ఆయన సూచించారు. గోవుల వధపై చట్టప్రకారం నిషేధం ఉన్నందున దానిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ అధికారంలో లేనప్పుడు దేశంలో గోవధ పేరుతో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకునేవని, అయితే తాము అధికారం చేపట్టిన తర్వాత వాటికి స్థానం లేకుండా చేశామన్నారు. ఎక్కడైనా గోవధ లాంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు. ముస్లిం గావ్ రక్ష సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ గోవులను రక్షించాలని తమపిల్లలకు తెలియజెప్పాలనే లక్ష్యంతోనే ఈ సంస్థను ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే గోసంరక్షణకు పాటుపడిన వారికి తమ సంస్థ ద్వారా గావ్ రత్న అవార్డులను ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలిపారు.