జాతీయ వార్తలు

సీట్లు.. ట్వీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. సామాజిక మాద్యమాల్లో నేతలపై జోక్‌లు పేలాయి. ఫలితాలు మంచి చేస్తాయా? చెడు చేస్తాయన్న అన్న విషయాన్ని పక్కనబెట్టి నెటిజన్ల ఛలోక్తులు హల్‌చల్ చేశా యి. ట్వీట్టర్‌ను కేంద్రంగా చేసుకుని పంచ్‌లు, జోక్‌లు, చమత్కారాలు హల్‌చల్ చేశాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనూహ్య గెలుపుపై ‘పప్పూ పాస్ హో గయా’అంటూ రాహుల్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 3 రాష్ట్రాల్లో కమలనాథుల ఓటమిపై ‘బీజేపీకి ట్రిపుల్ తలాఖ్’ ఫలితాలంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను బీజేపీ నేతలు ‘ముద్దు’గా పప్పూ అని సంభోదిస్తుంటారు. ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి ట్రిపుల్ తలాఖ్‌పై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్పదమైంది. ఇరుపార్టీలపై ఉన్న ఈ రెంటిని కేంద్రంగా చేసుకుని తెగ ట్వీట్లు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని తెగ జోక్‌లు పేల్చారు. యోగి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాలు, సంస్థల పేర్లు మారుస్తూ యోగి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వీటినే టార్గెట్ చేస్తూ సామాజిక మాద్యమాల్లో ఛలోక్తులు విసిరారు. ఓటమి పేరును ‘విక్టరీ’గా మార్చి మోదీకి చెప్పమని ఓ నెటిజన్ సలహా ఇచ్చారు. యూపీ సీఎం అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. తరవాత అది యోగి ఆదిత్యనాథ్‌గా మారింది. యోగి ఎన్నికల ప్రచారం అప్పుడూ హైదరాబాద్ పేరు మార్పుపై ప్రకటన చేస్తారేమోనని భయపడ్డామంటూ మరో ట్వీట్ చేశారు. దివ్యా స్పందన నేతృత్వంలోని కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ మోదీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. ప్రధాని నినాదం ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ స్థానే ‘బీజేపీ ముక్త్ భారత్’ అంటూ మూడు రాష్ట్రాల్లోనూ అదే జరిగిందని సెటైర్ వేశారు. ప్రముఖ రచయిత్రి శోభాడే ‘పప్పూ ఉత్తీర్ణుడయ్యాడు..పీహెచ్‌డీ కొట్టేశాడు’ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అవసరం ఎంతో ఉందన్నారు. ‘బీజేపీ ఓటమి నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఓటర్లు ఆ పార్టీకి ట్రిపుల్ తలాక్ చెప్పారు’అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తిర ట్వీట్ చేశారు. ‘అబ్‌కీ బార్, ఖోదీ సర్కార్ (ఈసారి ప్రభుత్వం ఓడింది)’ అంటూ పంఛ్ వేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నినాదం ‘అబ్‌కీ బార్ మోదీ సర్కార్’ను మార్చి అఖిలేష్ అలా ట్వీట్ చేశారు.