జాతీయ వార్తలు

సీఎం ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిని రేపుతున్నది. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే విధంగా మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) చీఫ్ జొరాంథంగా ముఖ్యమంత్రి కావడం ఖాయమైంది. మధ్యప్రదేశ్‌లో సీఎం పదవి కోసం 72 ఏళ్ల కమల్‌నాథ్, 47 ఏళ్ల జ్యోతిరాదిత్య సింధియా పోటీపడ్డారు. అయతే, కమల్‌నాథ్ పేరును జ్యోతిరాదిత్య స్వయంగా ప్రతిపాదించగా, 114 మంది ఎమ్మెల్యేలు ఆమోదించారు. దీనితో సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విధంగా మూడు రాష్ట్రాల్లో సీఎం ఎవరన్నది స్పష్టంకాగా, మిగతా రెండు రాష్ట్రాల్లో పోటీపోటీ కొనసాగుతున్నది. బీజేపీతో తీవ్రంగా పోరాడి, అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నది. రాజస్థాన్‌లో కూడా బీజేపీ నుంచి అధికార పగ్గాలను సొంతం చేసుకున్న తర్వాత సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతున్నది. అక్కడ అశోక్ గెహ్లాడ్, సచిన్ పైలట్ మధ్య పోటీ ఉంటుందని అంటున్నారు. గెహ్లాట్ వయసు 67 సంవత్సరాలుకాగా, సచిన్ పైలట్ వయసు 41 ఏళ్లు. మధ్యప్రదేశ్ మాదిరిగానే ఇక్కడ యువ, సీనియర్ నేతల మధ్య సీఎం కుర్చీ కోసం పోటీ తీవ్రంగా ఉంది. అధిష్టానం యువత నేతలకు అవకాశం ఇస్తుందా? లేక అనుభవజ్ఞులనే ఎంపిక చేస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. చత్తీస్‌గఢ్‌లో భూపేష్ బగెల్, టీఎస్ సింగ్ దేవ్, భక్త చరణ్‌దాస్ మహంత్, తమ్రాధ్వాజ్ సాహూ పోటీలో ఉన్నారు. వీరిలో భూపేష్ వయసు 57 ఏళ్లు. మిగతా వారంతా 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసువారే. ఇక్కడ కూడా సీఎం కుర్చీ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం కోసం సీఎం అభ్యర్థులేగాక, యావత్ దేశం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.