జాతీయ వార్తలు

అయ్యప్ప భక్తుడి ఆత్మాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శబరిమల అంశంపై పోరాడుతున్న బీజేపీ దీక్షా శిబిరం సమీపంలో గురువారం ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. 55 ఏళ్ల వ్యక్తి దీక్షా శిబిరంకు కూతవేటు దూరంలో నిప్పంటించుకుని ఆత్మహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. శబరిమల ఆలయం పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించడం, ఆలయ ప్రవేశంపై ఆంక్షలు పెట్టడాన్ని నిరసిస్తూ,ప్రభుత్వ ధోరణికి నిరసనగా ఈ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడి మరణించినట్లు బీజేపీ పేర్కొంది. ఈ వ్యక్తి పేరు వేణుగోపాలన్ నాయర్. ముత్తాడ గ్రామానికి చెందిన వారు. 90శాతం కాలిన గాయాలతో స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో మరణించారు. స్వామి శరణం అయ్యప్ప అంటూ ఆ వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. రాష్ట్ర సచివాలయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో దీక్షాశిబిరంలో బీజేపీ సీకే పద్మనాభన్ నిరవధిక దీక్ష చేస్తున్నారు. వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆ వ్యక్తి దీక్షాశిబిరం వైపు పరుగెత్తారు. ఆ సమయంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తిపైన నీళ్లుచల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు చెప్పిన దాని ప్రకారం నాయర్ స్వామి అయ్యప్ప భక్తుడు. ఈ ఘటనపై శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా బీజేపీ హర్తాళ్‌కు పిలుపునిచ్చింది. పినరయి విజయన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా నాయర్ ఆత్మహతికి పాల్పడినట్లు బీజేపీవర్గాలు తెలిపాయి.