జాతీయ వార్తలు

అనుక్షణం.. అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కాంగ్రెస్, ఆన్నా డీఎంకే, డీఎంకే, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు చేసిన గొడవ మూలంగా పార్లమెంటు ఉభయ సభలు గురువారం కూడా ఎలాంటి కార్యక్రమం నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. లోక్‌సభ రెండో విడతలో ఇరవై ఐదు నిమిషాలు పని చేస్తే.. రాజ్యసభ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పని చేసింది. లోక్‌సభ గురువారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ షిమోగా నుండి ఎన్నికైన బీవై రాఘవేంద్ర చేత సభ్యత్వ ప్రమాణం చేయించారు. ఆ తరువాత కొందరు మాజీ ఎంపీల మృతిపై సంతాపం తెలిపారు. ఇస్లామిక్ తీవ్రవాదులు 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిపిన దాడిలో మరణించిన వారికి స్పీకర్ సంతాపం తెలిపారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటికే పోడియం వద్దకు వచ్చిన టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణ, కాంగ్రెస్ సభ్యుడు తరుణ్ గొగోయ్ తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటుచేసుకున్న అవినీతిపై జేపీసీని నియమించాలంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ఇవ్వగా, అన్నా డీఎంకే సభ్యులు కర్నాటక ప్రభుత్వం చేపట్టన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ నినాదాలిచ్చారు. శివసేన సభ్యులు పోడియంను చుట్టముట్టి అయోధ్యలో రామాలయాన్ని వెంటనే నిర్మించాలంటూ నినాదాలివ్వటంతో లోక్‌సభ దద్దరిల్లిపోయింది. స్పీకర్ వారిని శాంతింపజేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించ లేదు. రెండుసార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం పనె్నండు గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పించారు. ఆ తర్వాత శివసేన పక్షం నాయకుడు ఆనంద్‌రావు అడసూల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ తన హామీని ఎందుకు మరిచిపోయిందని ప్రశ్నించారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అయోధ్యలో వెంటనే రామమందిర నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్
చేశారు. అడసూల్ మాట్లాడుతున్నంతసేపు ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. సభా కార్యక్రమాలకు తీవ్రంగా అంతరాయం కలగడంతో లోక్‌సభను శుక్రవారం ఉదయం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.
రాజ్యసభలో..
కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు చేసిన గొడవ మూలంగా రాజ్యసభ గురువారం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే పని చేసింది. రాజ్యసభ ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే చైర్మన్ వెంకయ్య నాయుడు మరణించిన మాజీ ఎంపీలకు సంతాపం తెలిపారు. అనంతరం ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. ఈలోగా అన్నాడీఎంకే, డీఎంకే, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నినాదాలివ్వటం ప్రారంభించారు. వెంకయ్య నాయుడు దీనికి అభ్యంతరం తెలుపుతూ పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి జరిపిన రోజైనా మనం ప్రశాంతంగా పని చేసుకోలేమా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు మనం తప్పుడు సంకేతాలు పంపిస్తున్నామని పదే పదే హెచ్చరించినా ప్రతిపక్షం సభ్యులు పట్టించుకోలేదు. దీనితో సభు శుక్రవారం ఉదయం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.