జాతీయ వార్తలు

పార్లమెంట్‌ను కుదిపేసిన రాఫెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాఫెల్ వ్యవహారంపై శుక్రవారం పార్లమెంటు ఉభ య సభల్లో బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌పై విమర్శల దాడికి దిగారు. కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సిం గ్ లోక్‌సభలో మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాలపై కొనుగోలుపై ప్రధానిపై అబాండాలు వేసిన రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై సుప్రీం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయ న అన్నారు. 3రాహుల్ తప్పుడు ఆరోపణలతో ప్ర పంచ స్థాయిలో దేశ పరువు, ప్రతిష్ట మంటగలిసిం ది2అని రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు తమ సీట్లలో నిలబడి రాహుల్ క్షమాపణలు చెప్పాలం టూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు. ప్రతిపక్షం కూడా వివిధ అంశాలపై ఉభయ సభల్లో పోడియం వద్దకు వచ్చి గొడవ చేసింది. అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు కాంగ్రెస్ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేసి దేశ ప్ర జలను తప్పుదోవపట్టించారని వారు ఆరోపించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సుప్రీం కోర్టు క్లిన్‌చిట్ ఇచ్చినందున దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుల నినాదాలతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌సింగ్ ఇరుపక్షాల సభ్యులను శాంతింపజేసేందుకు విఫల యత్నం చేశారు. లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ఒక వైపుబీజేపీ సభ్యులు సుప్రీం కోర్టు తీర్పు దృష్టా రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, అన్నా డీఎంకే సభ్యులు పోడియం వద్దకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. రాఫెల్ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటుచేసి విచారణ చేయించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ సభ్యులు నినాదాలు ఇచ్చారు. కర్నాటక ప్రభుత్వం చేపట్టిన మెకేదాటు నీటిపారుదలు ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపించాలని అన్నా డీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో సభ స్తంభించిపోయింది. దీంతో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే స్పీకర్ సుమిత్రా మహాజన్ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. లోక్‌సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా అధికార, ప్రతిపక్షం సభ్యులు నినాదాలు ఇస్తునే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల పరస్పర ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ఈ దశలో సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. బీజేపీ సభ్యులు తమ సీట్లలో నిలబడి రాహుల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో జేపీసీని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు పోటీగా నినాదాలు ఇచ్చారు. టీడీపీ, అన్నా డీఎంకే సభ్యుల తమ ప్లకార్డులను స్పీకర్‌కు అడ్డంగా పెట్టి ఆటంకం సృష్టించేందుకు ప్రయత్నించారు. దీంతో సభను 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యుల నినాదాల మధ్యే ప్రభుత్వ పత్రాలను సమర్పింపజేశారు. అనంతరం ఆమె ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ దశలో హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేచి కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌పై ఆరోపణలు గుప్పించారు. 3రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించారు. అందుకే ఆయన క్షమాపణలు చెప్పకప్పదు2అని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. ఈ దశలో ప్రతిపపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే సుమిత్రా మహాజన్ ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన పలువురు కాంగ్రెస్ సభ్యులు పోడియం పక్కన ఉన్న మెట్టు ఎక్కి స్పీకర్‌తో వాదనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుమిత్రా మహాజన్ వారిపై మండిపడ్డారు. 3మీరిలా మీదమీదకు వచ్చి మాట్లాడటం మంచిది కాదు. ఇదిలా కొనసాగితే తీవ్ర చర్యలు తీసుకోవలసి వస్తుంది2అని ఆమె తీవ్ర హెచ్చరిక చేశారు. అనంతరం స్పీకర్ లోక్‌సభను సోమవారం ఉదయం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. రాజ్యసభలో ఇదే పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్దకు వచ్చి మెకేదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలంటూ ప్లకార్డులతో నినాదాలు ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌సింగ్ అధికార, ప్రతిపక్ష సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తొలుత సభను అర్థగంట పాటు వాయిదా వేశారు. రాజ్యస సభ రెండోసారి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో సభను సోమవారం వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.