జాతీయ వార్తలు

జనంపై తూటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 15: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అల్లర్లకు దిగిన గుంపులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. అంతకు ముందు ఈ ప్రదేశంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటన వివరాలను పోలీసులు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసుమరణించాడు. ఈ ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులపై భద్రతాదళాలు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో కొంత కాలం ఆర్మీలో పనిచేసి పరారైన జహూర్ అహ్మద్ తోకర్ ఉన్నాడు. ఎన్ కౌంటర్‌లో తోకర్ మరణించాడన్న విషయం తెలిసి స్థానికంగా ఉండే కొంతమంది అల్లర్లకు దిగారు. రాళ్లు విసరడమే కాకుండా, వాహనాలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. కాగా అల్లరి మూకలను హెచ్చరికలను లెక్కచేయకుండా హింసకు దిగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. డజను మంది గాయపడ్డారు. టోకర్ అనే సైనికుడు గత ఏడాది నుంచి ఆర్మీ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఉగ్రవాదుల బృందంలో చేరి దేశ ద్రోహ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. పుల్వామా జిల్లాలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో టోకర్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కాల్పుల్లో హతమైన మరో ఇద్దరు ఉగ్రవాదుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా ఇద్దరు సైనికులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ప్రాంతానికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పౌరులపై సైనిక దళాలు కాల్పులు జరపడాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర ప్రజల ప్రాణాలను రక్షించడంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ సారథ్యంలోని పాలనా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తాయి. ఎలాంటి దర్యాప్తు జరిగినా పోయిన అమాయకుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని పిడిపి అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. గత ఆరు నెలలుగా దక్షిణ కాశ్మీర్ ప్రాంతం భయం గుప్పిట్లోనే తల్లడిల్లుతోందని పేర్కొన్న ఆమె ‘ఇదేనా గవర్నర్ పాలన అందిస్తున్న భద్రత?’అని ప్రశ్నించారు. భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ జరిపిన తీరు వల్లే ప్రజల్లో ఆగ్రహం పెరిగిందని, ఎప్పుడు ఎన్‌కౌంటర్లు జరిగినా ఆ ప్రాంతానికి సమీపంలోని గ్రామ ప్రజలు ఆందోళనగా చేరుకోవడం సర్వసాధారణమైపోయిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.

చిత్రాలు.. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆనందంలో జవాన్లు.
* పౌరుల అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన పౌరులు