జాతీయ వార్తలు

మిజోరం సీఎంగా జోరం ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్, డిసెంబర్ 15: మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ జోరంతాంగతో పాటు 12 మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కే రాజశేఖరన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలు పార్టీకి చెందిన నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజా ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌కు 40 సీట్లలో 26 సీట్లలో నెగ్గింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓటమిచెందింది. జోరంతాంగ గతంలో 1998, 2008లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురికి క్యాబినెట్ హోదా, ఆరుగురికి సహాయ మంత్రి హోదాను కేటాయించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజే లాల్‌నుంత్‌లుంగ కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసి ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఎంఎన్‌ఎఫ్‌లో చేరారు. కాగా కేంద్రంలో బీజేపీ ఎన్‌డీఏ సర్కార్‌కు తమ మద్దతు కొనసాగుతుందని జోరంతాంగ చెప్పారు. రాష్ట్రంలో ఆల్కోహాలిజం, మాదకద్రవ్యాలసేవనాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. మేఘాలయ ముఖ్యమంత్రి కోంరాడ్ సంగ్మా, అస్సాం మంత్రి కేషాబ్ మహంత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బైబిల్‌ను చదివారు. క్రైస్తవ భక్తి గేయాలను ఆలపించారు. మిజో చరిత్రలో తొలిసారిగా మంత్రులు మిజో భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.