జాతీయ వార్తలు

పాక్‌లో చదివించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: భారత్-పాకిస్తాన్‌ల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఓ అనూహ్య పరిణామాలకు దారితీసింది. పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్తలు, ఇతర అధికారుల పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తమ పిల్లల్ని ఇతర దేశాల్లో చదివించాలని పేర్కొంది. ఇందుకు కారణం - పాకిస్తాన్‌లో పరిస్థితులు పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకునేందుకు ఎంతమాత్రం యోగ్యంగా లేదని భావించడంగా చెబుతున్నారు. ఒక భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఆయా దేశాల్లోని పరిస్థితులను బట్టి తమ సిబ్బందికి సంబంధించి ఈ రకమైన నిర్ణయం తీసుకుంటాయని విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ ఉద్దేశంతోనే పాకిస్తాన్‌లోకాకుండా మరెక్కడైనా తమ పిల్లలను చదివించుకోవాలని అక్కడి హైకమిషన్‌లోని భారత అధికారులను కోరడం జరిగిందని వివరించారు. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత కమిషన్‌లో ఉన్న అధికారుల కుటుంబాలకు స్కూళ్లకు వెళ్లే పిల్లలు యాభైకి పైగానే ఉన్నారు. వీరందరినీ కూడా పాక్‌లో కాకుండా మరో దేశంలో చదివించుకోవాల్సిన పరిస్థితి తాజా ఆదేశాల నేపథ్యంలో భారత అధికారులకు ఏర్పడింది. అంతేకాకుండా పాకిస్తాన్‌లో పరిస్థితులు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు సజావుగా చదువుకుని ఇంటికి రావడానికి అనుకూలంగా లేవన్న సంకేతాలను కూడా భారత్ అందించినట్లయింది.