జాతీయ వార్తలు

‘దశ’దిశలా సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21:మైత్రీ బంధంలో సరికొత్త అధ్యయనానికి భారత్-చైనాలు శ్రీకారం చుట్టాయి. ద్వైపాక్షిక, ప్రజా సంబంధాలు, సాంస్కృతిక సహకారం సహా మొత్తం పది అంశాల ప్రాతిపదికగా కలిసి ముందుకు సాగాలని బలంగా సంకల్పించాయి. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ఈల మధ్య శుక్రవారం జరిగిన విస్తృత చర్చలు ఇరు దేశాలు సహకార పథంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు బలమైన బాటలే వేశాయి. ఇందుకు సంబంధించి కొత్తగా ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతో పాటు దశ దిశలా మైత్రీ బంధం ఇనుమడించేలా చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించారు. రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు బలపడాలంటే అందుకు ముందుగా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని సుష్మా స్వరాజ్ అన్నారు. ఇందుకు వీలుగా రెండు దేశాల సైన్యాలు పరస్పర విశ్వాసాన్ని ఇనుమడింపజేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ఇరు దేశాల సైనికుల మధ్య అపోహలకు తావులేకుండా విశ్వసనీయత ఇనుమడిస్తుందని చెప్పారు. అలాగే చైనాతో పెరిగిపోతున్న వాణిజ్య లోటుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా భారత వస్తు, సేవలకు చైనా తన మార్కెట్‌ను అందుబాటులోకి తేగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కల్లోల, అనిశ్చిత పరిస్థితులు ప్రబలమవుతున్న నేపథ్యంలో బలమైన దేశాలుగా ఉన్న భారత్-చైనాల మధ్య మైత్రి ప్రపంచ సుస్థిరతకు దోహదం చేస్తుందన్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రజా సంబంధాలు సహా అన్ని అంశాలనూ ఇరువురు నేతలూ ప్రస్తావించారు. చైనా విదేశాంగ మంత్రితో తాను జరిపిన చర్చలు అనుకున్న ఫలితాలు ఇవ్వడమే కాకుండా రెండు దేశాల మధ్య ఎన్నో అంశాలపై సారూప్యతనూ సాధించగలగడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వాంగ్‌ఈ సమక్షంలో విడుదల చేసిన ప్రకటనలో సుష్మ అన్నారు. పరస్పరం సంస్కృతిని పంచుకోవడం, ప్రజా సంబంధాలను ఇనుమడింపజేసుకోవడం, చలన చిత్రాలు, టెలివిజన్‌లో సహకారం, మ్యూజియం, క్రీడలు, టూరిజం, యోగా, విద్య, సంప్రదాయ వైద్య విధానం వంటి సహకార స్తంభాలు ఇరు దేశాలను మరింత చేరువ చేస్తాయని సుష్మ పేర్కొన్నారు. సాంస్కృతిక, ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సరికొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఇరు దేశాల మైత్రీ బంధంలో సరికొత్త మలుపు అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ఈ అన్నారు.