జాతీయ వార్తలు

రాఫెల్‌పై ప్రధాని మోదీని బ్లాక్ మెయిల్ చేస్తున్న పారికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పానాజీ, డిసెంబర్ 21: తన పదవిని కాపాడుకునేందుకు రాఫెల్ డీల్ వ్యహారంపై ప్రధాని నరేంద్రమోదీని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పారికర్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీని వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే వారు అధికారంలో లేరన్నారు. రాఫెల్‌ఫైటర్‌జెట్స్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నరేంద్రమోదీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం విదితమే. 36 పిటిషన్లను కూడా డిస్మిస్ చేసింది. రాష్ట్రంలో పాలనాసంక్షోభం తలెత్తిందని, ప్రజలసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పారికర్ పదవికి రాజీనామ చేయాలన్నారు. ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టకుండా పదవీ వ్యామోహంతో పారికర్ కొనసాతున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీని పారికర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన చెప్పారు. తనను పదవి నుంచి దించేసే ప్రయత్నం చేస్తే రాఫెల్ స్కాం వివరాలు బహిర్గతం చేస్తానని పారికర్ కేంద్రాన్ని బెదిరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు కొన్నాళ్లు కేంద్రంలో రక్షణ శాఖ మంత్రి పదవిని పారికర్ నిర్వహించిన విషయం విదితమే.