జాతీయ వార్తలు

దేశ వ్యాప్త సమ్మెపై నేడు సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: కేంద్రలో ఉన్న బిజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని అందుకు ప్రతిఘటనగా అన్ని జాతీయ కార్మి క సంఘాలు దేశ వ్యాప్త సమ్మెకు సమాయాత్తం కావాలని పిలుపు ఇస్తున్నాయి. 2019 జనవరి 8,9 తేదీల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేయడాని ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా పిలుపు ఇచ్చాయి. కార్మిక వ్యతిరేక ధోరణికి కేంద్ర ప్రభు త్వం పాల్పడుతోందని కార్మిక సంఘాలు నిరసనకు సిద్ధం అవుతున్నాయి. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో రాష్ట్ర సదస్సు ఏర్పాటుకు కార్మిక సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు జాతీయాస్థాయి కార్మిక నేతలు హాజరు కానున్నారని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ రమ చెప్పారు. ఐఎన్‌టీయుసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏఐటీయుసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్, సీఐటీయు జాతీయ ఉపాధ్యక్షుడు సుధాభాస్కర్‌తో పాటు ఇతర జాతీయ నేతలు పాల్గొంటారని రమ తెలిపారు.