జాతీయ వార్తలు

స్వీయ క్రమశిక్షణతో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రజాప్రతినిధులకు స్వీయ క్రమశిక్షణ ఉండాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. పాలన అలాగే సభకార్యక్రమాలు సజావుగా సాగడానికి జవాబుదారీతనం తప్పనిసరని ఆమె అన్నారు. పార్లమెంట్‌లో సభ్యుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ నియమాల కమిటీ సమావేశం స్పీకర్ మహాజన్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ జరిగింది. సభాకార్యక్రమాలు సవ్యంగా జరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. లోక్‌సభ సమావేశాల నిర్వహణకు ఈ కమిటీ సలహాలు, సూచనలు చేస్తుంది.
సమావేశానంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ విలేఖరులతో మాట్లాడుతూ అన్ని పార్టీల సభ్యులు సహకరిస్తే సభాకార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి వీలవుతుందని ఆమె అన్నారు.‘ప్రజాప్రతినిధులందరూ తాము ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలన్న విషయాన్ని విస్మరించకూడదు. ప్రజల కోసం, వారి సమస్యలు సభలోలేవనెత్తి పరిష్కారాన్ని కనుగొనే బాధ్యత ఎంపీలకు ఉంది. అలాగే సభ సవ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సభ్యులకు ఉంది’అని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో గందరగోళం సృష్టించే సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ‘ఇప్పటికైతే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభ్యులందరూ స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి’అని మహాజన్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఈనెల 27న లోక్‌సభలో చర్చించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే చేసిన ప్రకటనపై స్పీకర్ మాట్లాడుతూ ‘27న సభ సజావుగా సాగుతుందన్న విశ్వాసం నాకుంది’అని అన్నారు. గురువారం నాటి అఖిలపక్ష సమావేశంలో లోక్‌సభ కార్యక్రమాలకు తరచూ ఆటంకాలు కల్పించడంపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడోరోజూ లోక్‌సభలో నినాదాలు, నిరసనలతో సాగింది. అన్ని పార్టీలూ బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం కూడా లోక్‌సభలో సజావుగా సాగలేదు. పలు అంశాలపై అన్నాడీఎంకే,టీడీపీ,కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎంపీలు పార్లమెంట్ ప్రతిష్టను కాపాడాలని, బడిపిల్లలకంటే దారుణంగా సభలో వ్యవహరిస్తున్నారని గురువారం నాటి అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు.