జాతీయ వార్తలు

సైబర్ నేరాలకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సైబర్ నేరాలను అరికట్టడంలో భాగంగా, కంప్యూటర్ సిస్టమ్స్‌లో ఉన్న సమాచారాన్ని కనుగొనేందుకు, పర్యవేక్షించేందుకు పది కేంద్రం ఆధీనంలో ఉంటే నిఘా ఏజన్సీలకు అధికారాన్ని ఇస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏజన్సీలకు కొత్తగా అధికారాలు ఏమీ ఇవ్వలేదని , పాత నిబంధనల మేరకే రూపొందించామని హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. కాగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఈ విధానాన్ని సైబర్ సమాచార భద్రత డివిజన్ రూపొందించింది. ఈ విభాగం కేంద్రహోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆద్వర్యంలో పనిచేస్తుంది 2000 ఐటి చట్టం సెక్షన్ 69కు లోబడి పది ఏజన్సీలకు కంప్యూటర్‌లో నిక్షిప్తమైన ఉన్న సమాచారాన్ని వెలికితీసేందుకు, కనిపెట్టేందుకు, పర్యవేక్షించేందుకు, అభ్యంతరమైనవాటిని తొలగించే అధికారాన్ని కల్పించినట్లు కేంద్రం తెలిపింది. కంప్యూటర్ నుంచి ప్రసారమయ్యే, స్వీకరించే సందేశాల వివరాలను ఈ ఏజన్సీలకు తెలుసుకునే టెక్నాలజీని సమకూర్చారు. వ్యక్తిగత గోపత్యకు విఘాతం కలగకుండా సరైనరక్షణ చర్యలు కూడా చేపట్టామని పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ చట్టం కింద ఈ విధానాన్ని జారీ చేసినట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ అధికారాలను ఈ ఏజన్సీకి బదలాయించలేదని ప్రతినిధి చెప్పారు. 2009లో రూపొందించిన నిబంధనల్లో రూల్ 4 కింద మాత్రమే కేంద్ర హోంమంత్రిత్వశాఖ పది కేంద్ర ఏజన్సీలను గుర్తించిందని, అధికారాలు ఇవ్వలేదని తెలిపారు. 2009 నాటి నిబంధనల మేరకే తాజా నిబంధనలను రూపొందించామన్నారు. రాష్ట్రప్రభుత్వాల పరిధిలోని ఐటీ, హోంశాఖలకు ఈ నిబంధనలు వరిస్తాయన్నారు. వారు కూడా కంప్యూటర్ వ్యవస్థలను పర్యవేక్షించవచ్చన్నారు . తాము సేకరించిన వివరాలను ఈ ఏజన్సీలు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి అందచేస్తాయి. రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై సమీక్షిస్తుంది. రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. ఈ కొత్త నోటిఫికేషన్ వల్ల సైబర్ భద్రత పెరుగుతుంది. చట్టవిరుద్ధంగా కంప్యూటర్ వ్యవస్థలను పర్యవేక్షించే సంస్థల అక్రమాలను కొత్త నిబంధనల కింద ఏర్పాటైన పది ఏజన్సీలు నిలువరిస్తాయి.