జాతీయ వార్తలు

ఈ పరిణామం మంచిది కాదు : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: రాజ్యసభలో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న గొడవ, గందరగోళం పట్ల దేశ ప్రజల్లో ఆందోళన చేటుచేసుకుంటున్నదని, ఇది మంచి పరిణామం కాదని ఉప రాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. సభను సజావుగా జరగనివ్వకపోవడం మంచి పరిణామం కాదని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలను ఆయన హెచ్చరించారు. సభలోకి ప్లకార్డులు తెచ్చి ప్రదర్శించడం, ప్రత్యర్థి పార్టీ నాయకుడిని విమర్శిస్తూ నినాదాలు ఇవ్వడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఈ తప్పుడు సంప్రదాయానికి తెర దించవలసిందేనని వెంకయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్యసభ సమావేశం మొదలైన వెంటనే సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, సభలో రోజుల తరబడి గొడవ కొనసాగ డం, గందరగోళం నెలకొనడం, కార్యకలాపాలు సక్రమంగా కొనసాగకపోవడం వంటి పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సభలో జరుగుతున్న గొడవపై ప్రజలు చర్చించుకుంటున్నారని, జరుగుతున్న తతంగాన్ని ప్రజలు ఏ మాత్రం హర్షించడం లేదని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు సమావేశమై ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు అనుసరించవలసిన మార్గం అనే్వషించాలని ఆయన సూచించారు. సభ్యులు సభలోకి ప్లకార్డులు తెచ్చి ప్రదర్శించటం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఈ సంప్రదాయానికి తెర దించవలసిన సమయం వచ్చిందని వెంకయ్య స్పష్టం చేశారు. ప్లకార్డుల ప్రదర్శన వల్ల సభ ప్రతిష్ట దెబ్బతింటోందని, గొడవ, గందరగోళం మూలంగా ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు వ్యతిరేకంగా సభలోనినాదాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ తప్పుడు సంప్రదాయానికి తెర దించాల్సిందేనని వెంకయ్య అన్నారు. సభలో పర్సపరం వ్యక్తిగత విమర్శలకు దిగడం, నాయకులపై దుమ్మెత్తిపోయడం మంచి సంప్రదాయం కాదన్నది మనందరికి తెలుసునని అంటూ, అయినా ఇది కొనసాగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సభలో ప్రతి అంశానికి సంబంధించి చర్చించేందుకు నియమాలున్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని వెంకయ్య సూచించారు. తాము అన్ని అంశాలపై చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోందని, ప్రతిపక్ష పార్టీలు కూడా చర్చ కావాలంటున్నారని గుర్తుచేశారు. కాబట్టి గొడవకు తావివ్వకుండా సభను నడిపించుకునేందుకు అందరూ సహకరించాలని సభ్యులకు విజప్తి చేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, కావేరీ నదీ జలాలు, కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు తదితర అన్ని అంశాలపై కీలక చర్చ జరపవచ్చని అన్నారు. జీరో అవర్ కొనసాగడం లేదని, ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముందుకు సాగటం లేదని వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభను పెద్దల సభ అంటారని, సభలోని ప్రతి ఒక్కరూ అందరికీ ఆదర్శం కావాలని హితవు పలికారు. ‘ఏ సభ్యుడితో మాట్లాడినా మా పార్టీ చేయమన్నది కాబట్టి గొడవ చేస్తున్నామని చెబుతున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలకు విజప్తి చేస్తున్నాను. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించండి’ అని వెంకయ్య అన్నారు. సభను కొనసాగించుకోవడం, ప్లకార్డులు, తీసుకురావటం, నినాదాలు ఇస్తూ గొడవ చేయటం తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు రావలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. మనం దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారాలు కనుగొనేందుకు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారనేది మరిచిపోరాదని ఉప రాష్టప్రతి సభలోని ప్రతి ఒక్కరికీ హితవు పలికారు.