జాతీయ వార్తలు

వ్యక్తిగత గోప్యతకు భంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని పసిగట్టడం, పంపించే సందేశాలు, స్వీకరించే సమాచారాన్ని పర్యవేక్షించి తెలుసుకునే అధికారాన్ని పది కేంద్ర ఏజన్సీలకు అప్పచెప్పడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం విమర్శించింది. ఈ మేరకు సీపీఎం పొలిట్‌బ్యూరో ప్రకటనను విడుదల చేసింది. వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని సీపీఎం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని తెలిపింది. కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని పర్యవేక్షించే అధికారాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తదితర ఏజన్సీలకు అప్పగిచారు.
ఈ ఏజన్సీలు అడిగినప్పుడు కంప్యూటర్ రిసోర్స్ పర్సన్లు, సర్వీసు ప్రొవైడర్లు సాంకేతిక సహాయాన్ని ఏజన్సీలకు అందించాల్సి ఉంటుంది. నిర్దేశించిన విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోని సర్వీసు ప్రొవైడర్లకు , రిసోర్స్ పర్సన్లకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాను విధించే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తుంది.