జాతీయ వార్తలు

15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ప్రస్తుతం ఉన్న భవనం నుండి రెండు వారాల్లోగా ఖాళీ చేయాలని ఢిల్లీ హఐకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన విషయం విదితమే.
ఈ భవనం నుండి నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఖాళీ చేయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనక దురుద్దేశం లేదని కోర్టు పేర్కొంది. ఈ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ కంపెనీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ కంపెనీలు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వాటాదారులుగా ఉన్నారు. ఏజెఎల్ కంపెనీ పెట్టుకున్న అభ్యర్థను కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై హైకోర్టు 17 పేజీల తీర్పు ఇచ్చింది. రెండు వారాల్లోగా ఏజెఎల్ సంస్థ నేషనల్ హెరాల్డ్ భవనాన్ని ఖాళీ చేయని పక్షంలో పబ్లిక్ ప్రెమిసిస్ (అక్రమంగా ఉన్న భవనాల నుంచి ఖాళీ చేయించడం) చట్టం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. కేంద్రం దురుద్దేశంతోనే తమను భవనం నుంచి ఖాళీ చేయిస్తున్నదని ఏజేఎల్ సంస్థ ఆరోపించింది. ఈ తీర్పును జస్టిస్ సునీల్ గౌర్ వెలువరించారు. ఈ కేసులో నిరాధారమైన ఆరోపణలను కేంద్రంపై చేయడం తగదని కోర్టు పేర్కొంది. నేషనల్ హెరాల్ట్‌కు 56 ఏళ్లకు ఇచ్చిన లీజు గడువుముగియడంతో తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కేంద్రం కోర్టుకు విన్నవించింది. ఈ భవనంలో ప్రస్తుతం పత్రిక ప్రచురితం కావడం లేదని సెంటర్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ ఆఫీసు కోర్టుకు తెరిపింది. ఈ భవనాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని కోర్టుకు తెలిపారు.లీజు డీడ్ ప్రకారం ఈ భవనాన్ని వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించరాదు.