జాతీయ వార్తలు

రాష్టప్రతిని కలిసిన గవర్నర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్‌ను తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌లు శనివారం నాడు కలిసి ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులపై నివేదికలను అందించారు. శుక్రవారం నాడు రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్టప్రతి హైదరాబాద్ చేరుకుని కొద్ది రోజులు బొల్లారంలో ఉన్న రాష్టప్రతి నివాసంలో గడుపుతుంటారు. ఈ ఏడాది ఆయన డిసెంబర్ 21 నుండి 24వ తేదీ వరకూ ఇక్కడ ఉంటారు. ప్రత్యేక విమానంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ , రాష్టప్రతి పరిపాలనా సిబ్బంది, సహాయక సిబ్బంది హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం నాడు రాష్టప్రతి కరీంనగర్‌లోని మమతా మెడికల్ కాలేజీలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 23వ తేదీన రాష్టప్రతి నిలయంలో ఆయన రాష్టమ్రంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు రాష్టప్రతి విందు ఇస్తారు. అనంతరం ఆయన 24వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాష్టప్రతి నిలయానికి రాష్టప్రతి రాక సందర్భంగా పోలీసులు గట్టి పహరా ఏర్పాటు చేయగా, మరో పక్క రాష్టప్రతి భవన్‌కు రంగులు, హంగులను తీర్చిదిద్దారు.