జాతీయ వార్తలు

‘మోదీ విధానాలతో కష్టాల్లో కార్మికులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మిక వర్గాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు ఐక్యంగా పిలుపు ఇచ్చాయి. శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో అఖిల కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని తీర్మానం చేశాయి.దేశంలోని ప్రభుత్వ రంగసంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు బాసటగా నిలుస్తానని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారం చేపట్టాక కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువచ్చారని కార్మిక సంఘాల నేతలు నిప్పులు చెరిగారు. దేశాన్ని ప్రగతివైపు తీసుకుపోతానని చెప్పిన మోదీ దేశాన్ని అధోగతికి కారణమవుతున్నారని ధ్వజమెత్తారు.విదేశాల్లో దాచిన నల్లధనాన్ని స్వదేశానికి రప్పించలేదని, అలాగే పేదల జన్‌ధన్ ఖాతాల్లో ఒక్కరూపాయి జమ చేయలేదన్నారు. కార్మికులు చేమటోడ్చి కూడబెట్టిన పిఎఫ్ సొమ్మును కొల్లగొట్టే చట్ట సవరణలు తెచ్చారన్నారు. దేశమంతా ఒకే పన్నుల విధానం ఉండాలని వస్తుసేవల పన్ను(జిఎస్‌స్టీ) కారణంగా చిన్న తరహా పరిశ్రమలు, లక్షలాది మందికి ఉపాధి కల్పించే బీడీ పరిశ్రమ కుదేలైపోయిందన్నారు. లక్షాలాది వీధిపాలైయ్యారని వారు గుర్తు చేశారు. మోదీ చెప్పిన మంచి రోజులు ఏమయ్యాయని నిలదీశారు. పెద్ద నోట్లతో ఒరిగింది ఏమీలేదని, దీంతో ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయ్యిందన్నారు.