జాతీయ వార్తలు

సామాన్యులకు జీఎస్టీ ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు జీఎస్టీ నుంచి కొండంత ఊరట కల్పించింది. క్రిస్మస్ కానుకగా మొత్తం 23 వస్తు, సేవలపై పన్ను రేటు తగ్గించింది. సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్ స్క్రీన్‌లు, పవర్ బ్యాంక్‌లు సహా అనేక వస్తువుల ధరలు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మరింతగా తగ్గనున్నాయి. అలాగే నిల్వ ఉంచిన కూరగాయలపై లెనీని కూడా జీఎస్టీ మినహాయించింది. జనవరి 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. పన్ను రేట్లు తగ్గించిన 23 వస్తు, సేవల్లో 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు ఏడు ఉన్నాయని, వాటి పన్నును కూడా తగ్గిస్తున్నామని ఆయన తెలిపారు. ఈతాజా నిర్ణయం నేపథ్యంలో అత్యధిక స్థాయి 28 శాతం పన్ను పరిధిలో కేవలం 28 వస్తువులు మాత్రమే మిగిలాయని జైట్లీ అన్నారు. 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను తగ్గించిన వాటిలో పుల్లీలు, గేర్ బాక్స్‌లు, వినియోగించిన టైర్లు, లిథియం అయాన్ బ్యాటరీల పవర్ బ్యాంకులు డిజిటల్ కెమేరాలు, వీడియో కెమెరా రికార్డర్లు ఉన్నాయని తెలిపారు. 28 శాతం పన్నును విలాస, అలాగే హాని కలిగించే వస్తువులు, ఆటో పార్టులు, సిమ్మెంట్ వంటివి ఉన్నాయి. వీటిపై పన్ను తగ్గించపోవడానికి కారణం రెవిన్యూ గణనీయంగా తగ్గిపోతుందన్న ఆలోచనేనని జైట్లీ చెప్పారు. జీఎస్టీ పన్నురేట్లను వాస్తవానుగుణంగా మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతుందని ఆయన వివరించారు. మొదట్లో జీఎస్టీ రేట్లు ప్రకటించినప్పుడు దేశంలో నిర్హేతుక పన్నురేట్లు ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఈ వస్తువులపై 31 శాతం వరకూ పన్ను ఉండేదని దాని ప్రభావం ఇతర వస్తువులపై కూడా పడేదని అన్నారు. అందుకే విలాస, హాని కలిగించే వస్తువులను 28 శాతం పన్నుపరిధిలోనే ఉంచామని స్పష్టం చేశారు. ఒకవేళ వీటిపై పన్ను తగ్గించి ఉంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గడంతో పాటు అవి చేపట్టే సంక్షేమ పథకాలకు నిధులు తగ్గిపోయే అవకాశం కూడా ఉండి ఉండేదన్నారు.
దీని దృష్ట్యానే వాస్తవికతతో సహేతుక రీతిలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని జైట్లీ చెప్పారు. రెవిన్యూ పెరిగే కొద్దీ క్రమానుగతంగా పన్నురేట్లను తగ్గించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని అయితే విలాస, హాని కలిగించే వస్తువులకు మాత్రం ఎలాంటి మినహాయింపూ ఉండదని తేల్చిచెప్పారు. జీఎస్టీని హేతుబద్దీకరించే తదుపరి చర్యల్లో భాగంగా సిమెంట్‌పై విధించే పన్నుపైనా దృష్టిపెడతామని తెలిపారు. సిమ్మెంట్‌పై జీఎస్టీ తగ్గిస్తే ప్రభుత్వానికి 13వేల కోట్ల రూపాయల మేర వార్షిక ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. తాజాగా తగ్గించిన పన్నురేట్ల వల్ల ప్రభుత్వానికి వార్షికంగా 5,500 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గిపోతుందని జైట్లీ వివరించారు. 100 రూపాయల సినిమా టికెట్లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించామని, వంద రూపాయల పైనున్న టికెట్‌కు 18 శాతం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఇంతకు ముందు ఈ రేటు 28 శాతం ఉండేదని చెప్పారు. దీని వల్ల కూడా ప్రభుత్వానికి వార్షికంగా 900 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతుందని వివరించారు. ఇప్పటి వరకూ 28 శాతం పన్ను పరిధిలో ఉన్న మానిటర్లు, టీవీ స్క్రీన్‌లు, పవర్ బ్యాంక్‌ల రేటును 18 శాతానిక తగ్గించినట్టు స్పష్టం చేశారు. దీని వల్ల వార్షికంగా 1500 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. దివ్యాంగులు వినియోగించే వస్తువుల భాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే థర్డ్‌పార్టీ బీమా ప్రీమియంను 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చే వాటిలో మార్బుల్ రూబుల్,చేతి కర్రలు, మ్యూజిక్ పుస్తకాలు అలాగే కూరగాయలు( ఉడికించని లేదా బాయిలింగ్ చేసినవి). సేవలకు సంబంధించి వౌలిక పొదుపుఖాతా డిపాజిటర్లు(జన్‌ధన్ యోజన)కు మినహాయింపునిచ్చారు. అలాగే యాత్రికుల విమానయానానికి సంబంధించి జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. 28 శాతం జీఎస్టీ పన్నును అతికొద్ది వస్తువులకు మాత్రమే వర్తింప చేస్తామని, మిగతా వాటిపై గణనీయంగా పన్నురేట్లు తగ్గిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.