జాతీయ వార్తలు

అగ్ని-4 పరీక్ష విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా): భారత్ రక్షణ రంగం అంబుల పొదిలో అగ్ని-4 క్షిపణి చేరింది. బాలాసోర్ వద్ద బంగాళాఖాతంలో 4000 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు చేపట్టిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపకల్పంలోని సమగ్ర పరీక్ష రేంజ్ సముదాయం నుంచి అగ్ని-4 క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రాడార్లు, ట్రాకింగ్ సిస్టమ్స్, రేంజ్ స్టేషన్లు అగ్ని-4 క్షిపణి నిర్దేశించిన విధంగా శరవేగంగా దూసుకుపోయిందని శాస్తవ్రేత్తలు చెప్పారు. మొబైల్ లాంచర్ సహాయంతో అగ్ని-4ను ప్రయోగించారు. రాడార్లు, ఎలక్ట్రో ఆఫ్టికల్ సిస్టమ్స్‌ను ఒడిశా తీరం వెంట ముందుగా అమర్చారు. ప్రయోగం విజయవంతమైనట్లు అగ్ని-4 దూసుకెళుతున్న దృశ్యాలను నమోదు చేసిన రెండు నౌకల్లో ఉన్న శాస్తవ్రేత్తలు ధ్రువీకరించారు. అగ్ని-4 మిసైల్‌ను ఏడవసారి పరీక్షించారు. తొలుత ఈ ఏడాది జనవరి 2న ప్రయోగించారు. 20 మీటర్లు పొడువు, 17 టన్నుల బరువు కలిగివుండే అగ్ని-4ను అత్యంత ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.