జాతీయ వార్తలు

జగదీష్ టైట్లర్‌కు శిక్ష తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఇప్పటికే క్లీన్‌చిట్ పొందిన జగదీష్ టైట్లర్‌పై మళ్లీ ఉచ్చు బిగుసుకుంటోందా అన్న ఊహాగానాలు మొదయ్యాయి. ఇటీవల ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు శిక్షపడటంతో జగదీష్ టైట్లర్‌పై చర్య తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు న్యాయం దిశగా అడుగులు వస్తోందని, జగదీష్ టైట్లర్‌కు వ్యితిరేకంగా ఉచ్చు బిగుస్తోందని బాధితుల తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ హెచ్‌ఎస్ ఫుల్కా, లాయర్ కమ్నా వోహ్రా పేర్కొన్నారు.
ఈ కేసులో సజ్జన్‌కుమార్‌కు జీవితకాల శిక్ష పడిందని, అలాంటి శిక్షే టైట్లర్ కోసం ఎదురు చూస్తోందని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తాము సాధించిన గొప్ప విజయమని, దీనిని బట్టి ఈ కేసులో నిందితులైన ఇతరులకు కూడా శిక్షలు తప్పవని అన్నారు. టైట్లర్ కేసు కీలక మలుపు తిరిగిందని అన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తన ప్రమేయముందన్న ఆరోపణలను టైట్లర్ ఖండిస్తూ వస్తున్నారని, తనకు ఈ విషయంలో సీబీఐ మూడుసార్లు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, అయితే దర్యాప్తు సంస్థ నివేదికను కోర్టు తిరస్కరించిందని, ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఆదేశించిందని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఈ కేసుకు సంబంధించి సాక్ష్యమిచ్చిన పారిశ్రామికవేత్త అభిషేక్‌వర్మ ఇప్పటికే లై డిటెటక్టర్ పరీక్షను ఎదుర్కొన్నారని, దానికి సంబంధించిన నివేదిక ఒక నెలలో వస్తుందని, తాము దాని కోసం ఎదురు చూస్తున్నామని న్యాయవాదులు తెలిపారు.
అది వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని వారు చెప్పారు. అయితే తాము వర్మకు సంబంధించిన ఫలితంపైనే పూర్తిగా ఆధారపడమని, ఈ కేసుకు సంబంధించి ఇంకా తమకు పలు సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో సాక్షులను కొందరు ప్రలోభాలకు గురి చేశారని, ఒక ముఖ్యమైన సాక్షిని కెనడాకు పంపినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, అతడిని వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇలావుండగా జగదీష్ టైట్లర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది అరుణబ్ చౌదరి మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు టైట్లర్‌పై కేసులేమీ లేవని, అల్లర్లకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మూడు కేసులను ఇప్పటికే సీబీఐ మూసివేసిందని తెలిపారు.