జాతీయ వార్తలు

మనుగడ కోసమే మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కూటమి అపవిత్ర పొత్తుల కలయిక అని, ఈ ఫ్రంట్‌ను ప్రజలు విశ్వసించరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కేవలం వ్యక్తిగతంగా రాజకీయ లబ్ధి పొందేందుకు, అధికార కోసం తాపత్రయపడే పార్టీలే ఇందులో చేరుతున్నాయన్నారు. ఈ కూటమిలోని పార్టీలకు ప్రజల మద్దతు ఉండబోదన్నారు.
మహాకూటమిలోని పార్టీలు వారసత్వ రాజకీయాలు నడిపే కుటుంబ పార్టీలని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన చెన్నై నగరం, మధురై, తిరుచునాపల్లి, తిరువళ్లూర్ నియోజకవర్గాలకు చెందిన బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్ పక్కన చేరిన టీడీపీ వాస్తవానికి 1982లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీకి అవతరించిందని, కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి వ్యతరేకంగా ఎన్టీరామారావు టీడీపీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పంచన టీడీపీ చేరిందని, విశ్వసనీయతను కోల్పోతోందన్నారు. ఈ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుకు తహతహలాడుతోందన్నారు. ఈ రోజు మహాఘట్‌బందన్‌లోని పార్టీలు తామను సోషలిస్టు నేత రాంమనోహర్ లోహియా వారసులమని గొప్పగా చెప్పుకుంటున్నారని, కాని లోహియా కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతకర్త అనే విషయాన్ని మర్చిపోయారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాకూటమిలోని పార్టీలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, వీటికి సిద్ధాంతం లేదన్నారు. ప్రజల కోసం ఈ పార్టీలు పని చేయవని, కేవలం అధికారం ముఖ్యమన్నారు. లోహియా చెప్పినట్లుగా కాంగ్రెస్ అన్ని అంశాలపై రాజీపడే పార్టీ అని ఆయన అన్నారు. ఎమర్జన్సీ సమయంలో కూటమిలోని పార్టీల నేతలు అరెస్టుకు గురై జైలు జీవితాన్ని అనుభవించారని ఆయన గుర్తు చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్ పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఎమర్జన్సీని వ్యతిరేకించిన డీఎంకే ఈ రోజు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బలపరచడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేరగాళ్లు కీలకపదవుల్లో అధికారాన్ని చలాయించారన్నారవు. గతంలో కాంగ్రెస్ పార్టీ ములాయం సింగ్‌పై కేసులు పెట్టి వేధించిందన్నారు. గతంలో డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీతో ఈ రోజు ఆ పార్టీ చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేరన్నారు. కాంగ్రెస్ దుర్నీతిని ఎండగట్టిన టీడీపీని ఎన్టీఆర్ స్ధాపిస్తే, ప్రస్తుతం ఆ పార్టీ కాంగ్రెస్‌తో జతకట్టిందన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ సామ్రాజ్యవాద పార్టీ అని తీర్మానం చేసిన వామపక్షపార్టీలు, కాంగ్రెస్‌తో ఎలా కలుస్తారన్నారు. మహారాష్టక్రే పరిమితమైన ఒక పార్టీ కూడా కాంగ్రెస్‌తో అంటకాగుతోందని ఆయన శరద్ పవార్‌ను విమర్శించారు. భారత్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మహాకూటమి నేతలు మాత్రం వారసత్వ రాజకీయాలు కొనసాగాలంటున్నారన్నారు. బీజేపీపై నిరాధారమైన ఆరోపణలను ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కాలక్షేపం చేస్తోందన్నారు.