జాతీయ వార్తలు

పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగానే టీడీపీ పుట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీ రామారావు స్థాపించలేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌తో కలిసి కంభంపాటి విలేఖరులతో మాట్లాడారు. తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలు సరైనవి కావని చెప్పారు. కేంద్ర పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించిన పార్టీయే టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు. పధ్నాలుగేళ్లు ప్రతిపక్షం, 21 ఏళ్లుగా అధికారంలో ఉందంటే కారణం- తెలుగుదేశం పార్టీకి సంస్థగత, వ్యవస్థాగత బలం మాత్రమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలుచేసిన తరువాతే నరేంద్ర మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని అన్నారు. విభజన హామీల వైఫల్యంవల్లే ఏన్డీయే నుంచి తాము బయటకు వచ్చామని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తులపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని కంభంపాటి చెప్పారు.

చిత్రం..కంభంపాటి రామ్మోహన్‌రావు