జాతీయ వార్తలు

ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడోరోజు సోమవారం వాయుకాలుష్యం జడలు విప్పింది. వాతావరణంలో వచ్చిన మార్పులు, వివిధ కారణాల వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగర పౌరులు పర్వదినాలను ప్రశాంత వాతావరణంలో చేసుకునే పరిస్థితులు లేవు. దీపావళి రోజు అత్యధిక స్థాయిలో కాలుష్యం విజృంభించింది. వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో నమోదైంది. ఇపుడు క్రిస్మస్ పండుగకు కూడా వాయు కాలుష్యం బాధ తప్పలేదు. ఈ రెండ్రోజలు పౌరులు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రజారవాణాను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) గణాంకాల ప్రకారం వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో 448గా నమోదైంది. సోమవారం ఢిల్లీలోని 30 ప్రాంతాల్లో ప్రమాద స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. మరో ఐదు ప్రాంతాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సీపీసీబీ అందించిన వివరాల ప్రకారం నొయిడాలో కాలుష్యం పరమ అధ్యన్నంగా ఉంది. అక్కడ 464గా నమోదైంది. ఫిజియాబాద్, ఘజియాబాద్‌లోనూ ప్రమాదకర స్థాయిలో ఉంది. గుర్గావ్‌లో మరీ తీవ్రంగా ఉన్నట్టు సీపీసీబీ వెల్లడించింది. ఢిల్లీని శనివారమే కాలుష్య భూతం కప్పేసింది. సోమవారం వరకూ అదే కొనసాగింది. మంగళవారం కూడా అదే పరిస్థితి ఉంటుందని సాయంత్రానికి కాస్త తగ్గే సూచనలను ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని పంజాబ్, హర్యానాలో పొగమంచు భారీ స్థాయిలో ఉంది. వాహనదారులకు దారి కనిపించక అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కనీసం 7 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి.