జాతీయ వార్తలు

హనుమంతుడు క్రీడాకారుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 24: ‘కాదేదీ రాజకీయాలకు అనర్హం’ అన్నట్టుగా నేటి నేతల పోకడలు వింతగా, విడ్డూరంగా సాగుతున్నాయి. మనం నిత్యం ఆరాధించే, పూజించే పురాణ పురుషులను సైతం రాజకీయాల్లోకి లాగి వారి దైవత్వానికే భంగం కలిగించే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో తీవ్రమయ్యాయి. నిన్న రాముడు, నేడు ఆయన పరమభక్తుడైన హనుమంతుడు.. ఇలా ఎవరినీ వదలకుండా సాగుతున్న నేతల వాచాలత విస్మయానే్న కలిగిస్తోంది. స్వామి భక్తికి, సత్యవర్తనకు నిలువెత్తు నిదర్శనం ఆ పురాణమూర్తి. ఆయనే్న ఇటీవలి కాలంలో రాజకీయ రొంపిలోకి లాగారు. ఎవరికి తోచిన రీతిలో వారు ఆ పురాణ పురుషులకు కొన్ని లక్షణాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. హనుమంతుడికి కులాన్ని అంటగట్టడమే కాకుండా ఆయన దళితుడంటూ ఇటీవల ఓ రాజకీయ నాయకుడు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మరో అడుగు ముందుకేసి ఆంజనేయుడిని ఒక క్రీడాకారుడిగా అభివర్ణించారు. పురాణ పురుషులకు కులాలు ఉండవని.. వాళ్లని ఏ కులమూ సొంతం చేసుకోవడానికి వీలులేదని స్పష్టం చేసిన యూపీ మంత్రి, మాజీ క్రికెటర్ అయితే చేతన్ చౌహాన్ ‘హనుమంతుడు ఒక దేవుడు.. ఆయనను నేను పూజిస్తాను.. నేను క్రీడాకారుడ్ని. ప్రతి క్రీడాకారుడు శక్తిని ఆరాధించాలి. హనుమంతుడు శక్తికి, బలానికి సంకేతం. ఆయన మల్లయోధుడు కూడా. అందులే మల్లయోధులందరూ ఆయనను ఆరాధిస్తారు’ అని విశే్లషించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ‘హనుమంతుడు ఒక దళితుడు’ అంటూ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించాడు. దాంతో అనేకమంది హనుమంతుడిది ఏ కులం అన్న దానిపై సొంత వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. యూపీకి చెందిన మరో మంత్రి లక్ష్మీ నారాయణ- హనుమంతుడిని ఓ జాట్‌గా అభివర్ణించారు. అలాగే మరో బీజేపీ శాసనసభ్యుడు బుక్కల్ నవాబ్ మరో అడుగు ముందుకేసి హనుమంతుడు ముస్లిమేనని అన్నాడు. అంతేకాదు ముస్లిం పేర్లయిన రెహ్మాన్, పర్మాన్, జిషాన్ తరహాలోనే హనుమాన్ పేరుకూడా ఉందంటూ ఆయన తన వాదనను సమర్థించుకున్నారు. అందుకే తాను హనుమంతుడికి ముస్లింగా భావిస్తున్నానని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ ఉద్యమం వేడెక్కుతున్న నేపథ్యంలో ఇలా పురాణ పురుషులకు కులాలు అంటగట్టడం వారిని ఆరాధించే భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.