జాతీయ వార్తలు

పీడిత జనస్వరం మహాశే్వత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 28: పీడిత జనులకోసం ఆమె అహరహం పరితపించారు. వారి హక్కులకోసం వారి గొంతై నినదించారు. మహాశే్వతాదేవి ప్రఖ్యాత రచయిత్రి 90 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూసేదాకా ఆమె అణగారిన వర్గాల కోసమే పరితపించారు. సాహిత్య ప్రపంచంలో ఆమె సృజన అంతా వారికోసమే సాగింది. పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, జ్ఞానపీఠ, సాహిత్య అకాడమీ అవార్డులు ఎన్నో ఆమెను అలంకరించాయి. ఆమె రచించిన హజార్ చౌరాసీ మా, ఆరణ్యర్ అధికార్, ఝాన్సీరాణి, రుడాలి, అగ్నిగర్భ, సిధుకన్హూర్ దాకే వంటి రచనలన్నీ అణచివేయబడ్డ ప్రజల జీవితాలను లోతుల్లోంచి ప్రతిఫలింజేసినవే. 1998లో ఆమె నవల ‘హజార్ చౌరాసీ కీ మా’ను ప్రఖ్యాత సినీదర్శకుడు గోవింద్ నిహలానీ సినిమాగా తీశారు. నక్సలైట్ల ఉద్యమంలో తన కొడుకు చేరిపోవటం వెనుక కారణాలను అర్థం చేసుకోవటం కోసం ఒక తల్లి పడిన మానసిక, భావోద్వేగ సంఘర్షణను మహాశే్వత తన నవలలో అద్భుతంగా ప్రతిఫలింపజేశారు. అంతకుముందు రాజస్థాన్‌లో సంపన్నుల ఇళ్లలో శవాల ముందు ఎడవటమే వృత్తిగా జీవించే మహిళల జీవితాలపై రచించిన నవల ‘రుడాలీ’ 1993లో సినిమాగా వచ్చింది. ప్రఖ్యాత గాయకుడు భూపేన్ హజారికా పాడిన పాటలు బాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. ఆమె రాసిన ‘చోలీ కే పీఛే’ చిన్నకథను ఇటలీ దర్శకుడు ఇటాలో స్పైనెల్లి సినిమాగా తీశారు. రచయితగా, విలేఖరిగానే కాకుండా మహాశే్వతాదేవి సామాన్యుల హక్కులకోసం అలుపెరుగని పోరాటం చేశారు. ప్రఖ్యాత రచయిత్రిగా పేరు పొందినప్పటికీ, మహాశే్వతాదేవి అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. 1926లో ఢాకాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మహాశే్వతాదేవి రబీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్‌లో విద్యాభ్యాసం చేశారు. ప్రఖ్యాత నాటక రచయిత బిజోన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జన్మించిన కుమారుడు నబరున్ 2014లో చనిపోవటం ఆమె జీవితంలో విషాదం. సామాజిక కార్యకర్తగా ఆమె వివిధ పత్రికల్లో వేలాది వ్యాసాలు రచించారు. ఒడిశా, బెంగాల్, బిహార్‌లలోని గిరిజన సమాజాల కోసం అనేక పోరాటాలు చేశారు. గ్రామీణ భారత జనజీవనంపై ఆమె ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయాయి.

మహాశే్వతాదేవి (ఫైల్ ఫోటో)