జాతీయ వార్తలు

శబరిమల మళ్లీ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, డిసెంబర్ 24: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోడాని వచ్చిన ఇద్దరు మహిళను ఆందోళనకారలు అడ్డకించడంతో వెనుదిరిగారు. భక్తుల ఉంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం రావడంతో పూజలు చేయకుండానే వెనుదిరిగారు. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళల ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం చైనె్నకు చెందిన ‘మణితి’ సంస్థ కార్యకర్తలు 11 మంది ఆలయ ప్రవేశానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు ఇద్దరు మహిళలు పంబకు చేరుకున్నారు. దీన్ని గమనించిన ఆందోళనకారులు వారి వెంటబడ్డారు. సన్నిధానం(ఆలయ ప్రాంగణం) నుంచి కిలోమీటర్ దూరం వరకూ పోలీసుల భద్రత మధ్య తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆ మార్గం ఇరుకైంది కావడంతో పోలీసులు, అయ్యప్ప భక్తుల మధ్య చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అయ్యప్ప గీతాలు ఆలపిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారుల్లో యువత కూడా ఇద్దరు మహిళలు వెనక్కివెళ్లిపోవల్సిందిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా శబరిమల మార్గంలో అప్పచెముడు వద్ద మహిళలను ఓసారి ఆపారు. అయితే నిరసనకారులను పోలీసలు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇలా ఉండంగా ఇద్దరు మహిళను బసచేసిన నివాసం ఎదుట బీజేపీ కార్యాకర్తలు బైఠాయింపుజరిపారు. మరోపక్క ఆందోళనకారుల వత్తిడి వల్ల తాను స్పృహతప్పిపడిపోయానని కనకదుర్గ వాపోయింది. తమను అడ్డుకోవం వెనక పెద్ద కుట్ర ఉందని బిందు ఆరోపించింది. తాము గుడివైపువెళ్లకుండా పోలీసులు బలంతంగా అడ్డుకున్నారని ఆమె తెలిపింది. బిందు, కనకదుర్గను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సుప్రీం కోర్టు తీర్పును ప్రభుత్వం అమలుచేయాలన్నదే తమ డిమాండ్ అని అంతకు ముందు బిందు మీడియాకు చెప్పారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగానే తమను ఆలయంలోకి అనుమతించాలని కోరుతున్నామేతప్ప అందలో ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని ఆమె చెప్పారు. పోలీసుల భద్రత కోసం తాము అడగాల్సిన అవసరం లేదని అది పోలీసుల డ్యూటీ అని వారు వాదించారు.‘మేం పోలీసుల భద్రత కోరడం లేదు. సుప్రీం కోర్టు తీర్పును అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆలయ ప్రవేశం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిక ఉంది’అని బిందు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత చాలా రోజలు శబరిమల నిరసనలతో అట్టుడికపోయింది. మండల వార్షిక పూజలు ప్రారంభంతో భక్తుల రద్దీ పెరిగింది.

చిత్రం..అయ్యప్ప భక్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సన్నిధానానికి
కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన మహిళా కార్యకర్తలు