జాతీయ వార్తలు

మోదీది వన్ మ్యాన్ షో: శతృఘ్నసిన్హా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 24: కేంద్ర నాయకత్వంపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఒన్ మెన్ షో అంటూ సిన్హా విరుచుకుపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఎంపీ వదలిపెట్టలేదు. మోదీ, అమిత్‌షాలది ‘ఒన్ మెన్ షో..టూ మెన్ ఆర్మీ’అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తికంటే పార్టీ గొప్పది, అలాగే పార్టీ కంటే దేశం గొప్పది అని ఆయన పేర్కొన్నారు. ‘నన్ను ఎవరేమనుకున్నా సరే.. జాతి ప్రయోజనాలే నాకు ముఖ్యం. సొంత ప్రయోజనాలను నేను పట్టించుకోను’అని ఆయన స్పష్టం చేశారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రచించిన ‘ద పేరడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, నరేంద్ర మోదీ అంట్ హిజ్ ఇండియా’ పుస్తకావిష్కణ కార్యక్రమానికి సిన్హా హాజరయ్యారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై ఆయన విమర్శలు గుప్పిస్తూ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. దేశ ప్రజలకు కావల్సింది ఉద్యోగాలు, మంచి సౌకరాలు అంతే తప్ప శుష్కవాగ్దానాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు అని ఆయన ఎద్దేవా చేశారు.‘నేను 15 లక్షల గురించి మాట్లాడడం లేదు. మోదీకి నేను వ్యతిరేకిని కాదు. ఒన్ మెన్ షో, టూ మెన్ ఆర్మీని వ్యతిరేకిస్తున్నాను. ఆ ఇద్దరే దేశాన్ని శాసిస్తున్నారు’అని శతృఘ్నసిన్హా నిప్పులు చెరిగారు. డిమోనిటేజేషన్, జీఎస్టీపైనా ఆయన విమర్శలు గుప్పించారు.