జాతీయ వార్తలు

రుణమాఫీ హామీతో రైతులకు వెన్నుపోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: రుణ మాఫీ హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసగిస్తోందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేసేవరకు ప్రధాన మంత్రి మోదీని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ రైతులే రాహుల్‌ను ఇక నిద్రపోనివ్వరని సోమవారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోవున్న కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో రైతుల రుణ మాఫీ విషయంలో ఆ పార్టీ ప్రభుత్వాలు కేవలం కంటితుడుపుగా మాత్రమే వ్యవహరించాయని ఉదహరించారు. అలాగే రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో సైతం హామీలను నిలుపుకోదన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీఇచ్చి గెలిచి ఇప్పుడు ఆ హామీలను విస్మరించారని జవదేకర్ అన్నారు. కర్నాటకలో 45వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తామని చెప్పి కేవలం ఇప్పటి వరకు 75 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఆయన వెల్లడించారు. అలాగే పంజాబ్‌లో 90 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్‌లో కేవలం 3కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని వివరించారు. పైగా రైతులకు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసి, మనోవేదనకు గురిచేస్తున్నారని విమర్శించారు. కర్నాటకలో ఇప్పటి వరకు 397 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధాన హామీగా రుణమాఫీని పేర్కొంటూ నరేంద్ర మోదీని దోషిగా చేసి మాట్లాడిన రాహుల్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.