జాతీయ వార్తలు

అవినీతితో అభివృద్ధికి ఆమడ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖుర్దా (ఒడిసా): ఒడిసాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని అవినీతి భూతం పట్టుకుందని, అది రోజురోజుకు పెద్దదవుతోందని, ఆ రాష్ట్రంలో ప్రతి దానికి కమీషన్ల పర్సంటేజి సంప్రదాయం పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు సమీపంలోని ఖుర్దా సమీపంలో జరిగిన కార్యక్రమంలో సోమవారం 1817లో ఒడిసాలో జరిగిన తిరుగుబాటు స్మారకార్థం స్టాంప్, నాణెంను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు తగిన సహాయం అందుతున్నా రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందని, రాష్ట్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం వల్ల అభివృద్ధికి దూరంగా ఉందని, అసలు ఈ అవినీతి భూతాన్ని పెంచి పోషిస్తున్నదెవరో కేంద్రం తెలుసుకోవాలనుకుంటున్నదని అన్నారు. రాష్ట్రంలో చిట్‌ఫండ్ కుంభకోణాలు, కమీషన్ల సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని మోదీ ఆరోపించారు. 2000 నుంచి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చిన బీజేడీకి చెందిన నవీన్ పట్నాయక్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలతో ఐదోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒడిసాను అత్యంత ప్రాధాన్యత గల రాష్ట్రంగా గుర్తించిన కేంద్రం అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఎన్నో నిధులను విడుదల చేస్తోందని, అయినా రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందని ఆయన ఆరోపించారు. ఈసారి పాలనలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలవారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నూతన మార్గంలో పయనించాలని కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నూతనంగా తీర్చిదిద్దడానికి బీజేపీ కంకణం కట్టుకుని ఉందని ఆయన చెప్పారు. తాము ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ పథకం లక్ష్యాన్ని 95 శాతం చేరుకున్నామని, కాని ఒడిసా రాష్ట్రం మాత్రం ఈ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉందని, బహిరంగ విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలోని పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. రైతులకు సరైన సాగునీటి సౌకర్యాలు అందడం లేదని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కరవవుతోందని మోదీ ఆరోపించారు. ప్రజలకు మంచినీరు అందడం లేదని, ఉపాధ్యాయులకు సరైన జీతాలు అందక ఉద్యమ బాటలో ఉన్నారని అన్నారు. లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తిరస్కరించిందని ఆయన చెప్పారు. స్వరాష్టమ్రే కాక, దేశంలో ఎక్కడైనా వైద్య సౌకర్యం లభించే ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని లింక్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఒడిసా ప్రభుత్వం కనుక కేంద్ర పథకంలో చేరి ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఐదు లక్షల వరకు వైద్య సౌకర్యాన్ని బయటి రాష్ట్రాలలో సైతం కలుగుతుందని ఆయన చెప్పారు. దీనివల్ల ఆరు లక్షల మంది పేదలకు ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని పరదీప్ నుంచి హైదరాబాద్‌కు 3,800 కోట్లతో చేపట్టబోయే ఇండియన్ ఆయిల్ పైపులైన్ ప్రాజెక్టుకు, అంగుల్ నుంచి బోకారోకో 3,437 కోట్లతో చేపట్టబోయే గెయిల్ గ్యాస్ పైపులైన్‌కు శంకుస్థాపన, ఐఐటి భువనేశ్వర్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవాలను చేశారు.
చిత్రం..ఒడిశాలోని ఖుర్ధాలో సోమవారం జరిగిన స్వాభిమాన్ సందేశ్ ర్యాలీలో
మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ